మిస్టర్ ప్రైమ్ మినిస్టర్..! మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లేనా ఏపీకి ఇచ్చింది…?

ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగసభ నిర్వహించలేకపోయినా.. నరేంద్రమోడీ.. రెండో తేదీన తన యాప్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడి.. కావాల్సినంత రాజీకీయం చేసే ప్రయత్నం చేశారు. ప్రధాని స్థాయిలో ఉన్నా… ఆయన దిగువ స్థాయి రాజకీయ ఆరోపణలు.. విచిత్రమైన హావభహావాలతో చేస్తూ ఊంటారు కాబట్టి… అవి సహజమే. అందరికీ.. ఆసక్తి రేకెత్తించిన అంశం ఏమిటంటే.. ఏపీకి ఏం చేశారని చెబుతారనే..?. బీజేపీ కార్యకర్తలు కూడా దీని గురించే ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. మోడీ ఏం ఏం చెబితే.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకున్నారు. తీరా… మోడీ ముఖాముఖి అయిపోయిన తర్వాత విశ్లేషించుకుంటే… వారికి కూడా.. చెప్పుకోవడానికి ఏమీ దొరకలేదని అర్థం అయింది.

కేంద్ర విద్యాసంస్థలను జాలి పడి ఇచ్చారా..?

1.పది కేంద్ర విద్యాసంస్థలు ఇచ్చాం..! గతంలో ఎందుకు ఇవ్వలేదో టీడీపీ, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి..?

ప్రధానమంత్రిగా ఏదో ఆవేశ పడ్డారు కానీ.. రాజ్యాంగ పరంగా కానీ.. సంప్రదాయ పరంగా కానీ.. కేంద్ర విద్యాసంస్థలు ప్రతి రాష్ట్రంలోనూ ఉండాలి. ఎయిమ్స్ లాంటి ఆస్పత్రులు ప్రతీ రాష్ట్రంలోనూ ఉండాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కొత్తగా ఇచ్చారు. గతంలో ఎందుకివ్వలేదనే విచిత్ర వాదన ప్రారంభించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కోటాలో అన్ని విద్యాసంస్థలు మంజూరయ్యాయి. గొప్ప ప్రమాణాలతో.. మెరుగైన స్థితిలో ఉన్నాయి. కానీ అవన్నీ.. ఇప్పుడు తెలంగాణకు పోయాయని సంగతి మర్చిపోయినట్లు ఉన్నారు. ఏపీ… కొత్తగా ఉనికి వచ్చే సరికి వచ్చింది.. బీజేపీ ప్రభుత్వమే. చేయాల్సిందంతా బీజేపీ ప్రబుత్వమే. అయినా చేయాల్సింది చేయలేదు. పైగా.. రాజకీయ విమర్సలు. పది విద్యా సంస్థలను పేపర్‌పై మంజూరు చేసి.. ఊరవతల… పక్క రాష్ట్రంలోనో తాత్కాలిక తరగతులు నిర్వహిస్తే.. అది గొప్ప సాయం చేసినట్లా..? ఆ పది విద్యా సంస్థలకు ఇప్పుడు కేటాస్తున్టన్లుగా అణాపైసలు కేటాయిస్తే.. ఎప్పటికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతాయి..?

38 లక్షల మరుగదొడ్లు, 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ..! సరిపెట్టుకోవాలా..?

ప్రధానమంత్రి ఏపీకి ఇచ్చినట్లు గొప్పగా చెప్పుకున్న మరో అంశం మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు. 38 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులిచ్చి… ఏపీకి గొప్ప సాయంచేసినట్లు చెప్పుకున్నారు. మరి ఏపీలో వసూలు చేసిన స్వచ్ఛ్ భారత్ సెస్… ఉత్తర భారతీయులు కట్టారా..? ఏపీ ప్రజలు కట్టిన దానికి ఎవరు లెక్క చెబుతారు..? ఇక గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్లిచ్చామని… కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ… కేంద్రం వంద శాతం నిధులతో ఇచ్చిందా..?. ఉదారంగా ఇచ్చిందా..? ఏపీ నుంచి పన్నులు వసూలు చేస్తున్నా రు కాబట్టి.. రాజ్యాంగం ప్రకారం.. వాటా ఉంటుంది కాబట్టి… ఇచ్చారు..ఇందులో… ప్రత్యేకత ఏమీ లేదు. దీనికే గొప్ప సాయం చేశామని చెప్పుకోవడం ఎందుకు..?

మరి ఇవ్వాల్సిన వాటి సంగతేమిటి..?

ప్రత్యేకహోదా నుంచి లోటు భర్తీ వరకూ… కడప స్టీల్ ఫ్యాక్టరీ నుంచి రైల్వేజోన్ వరకు.. విభజన చట్టంలోని పదిహేడు అంశాల గురించి మోడీ ఎందుకు మాట్లాడరు..? ఏపీకి ఇవ్వాల్సిన వాటిలో తన హామీలను నాలుగున్నరేళ్లయినా.. ఎందుకు ఇవ్వడం లేదని చెప్పరు. ఏపీకి ఇవ్వాల్సిన వాటిని అడుగుతూంటే.. రాజకీయంగా దాడి చేయించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఓ రకమైన దారుణమైన మనస్థత్వంతో.. కొన్నాళ్లుగా ఏపీపై జరుగుతున్న రాజకీయ దాడులకు అర్థం ఏమిటి..? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు. అవినీతి ఆరోపణలు చేసి… ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచితే… ఇక ఏమీ ఇవ్వక్కర్లేదనుకుటున్నారా..?

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close