కిడ్నాప్ ఎపిసోడ్‌లో పోలీసుల “స్పెషల్” స్టోరీలు..!

ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను మాజీ మంత్రి అఖిలప్రియ వర్గం భూ వివివాదంలో కిడ్నాప్ చేసిన వ్యవహారంలో పోలీసులు ..స్పెషల్ స్టోరీలను మీడియాకు ఇస్తున్నారు. కావాల్సినంత మసాలా ఇచ్చి స్పషల్ స్టోరీలు చేసుకోమని సలహా ఇస్తున్నారు. స్పెషల్ 26 అనే సినిమా చూసి కిడ్నాపర్లు ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేశారని మీడియాకు చెప్పారు. అంతే కాదు స్కెచ్ ఎలా వేశారో కూడా చెప్పుకొచ్చారు. నిజానికి రాయలసీమ గ్యాంగులను చూసి సినిమా వాళ్లు కథలు.. సన్నివేశాలు రాసుకుంటారు.కానీ ఇక్కడు పోలీసులు భిన్నంగా చెబుతున్నారు. హిందీ సినిమా చూసి రాయలసీమ గ్యాంగ్ కిడ్నాప్ స్కెచ్ వేసిందని చెబుతున్నారు.  

అయితే పోలీసులు అనధికారికంగా కొన్ని విషయాలు మీడియాకు లీక్ చేస్తున్నారు. వాటిలో ఓ సంచలనం కూడా ఉంది. అదేమిటంటే… ఈ భూవివాదం సెటిల్మెంట్ కోసం రెండు వర్గాలు కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నాయి. అఖిల ప్రియ అధికార పార్టీలో లేకపోవడం.. ఎదుటి వర్గం… తెలంగాణ సీఎం బంధువర్గం కావడం… ఆ  భూమి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతుల్లోకి వెళ్లిపోవడం వల్ల..సెటిల్మెంట్ విషయంలో భూమా వారసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ముందుగా బెంగళూరులోని ఓ హోటల్లో సెటిల్మెంట్‌కు ప్రయత్నం జరిగింది. తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖులు.. ప్రవీణ్‌, భార్గవ్‌ మధ్య సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించారు. ఇదంతా అఖిలప్రియ సమక్షంలోనే జరిగిందని గుర్తించారు. అయితే సెటిల్మెంట్  కుదరకపోవంతో.. అఖిలప్రియ కిడ్నాప్ స్టెప్ తీసుకున్నారని పోలీసులు లీక్‌ చేస్తున్నారు.

రాజకీయప్రాధాన్యత ఉన్న ఈ కేసులో పోలీసులు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించడం కన్నా.. మీడియాకు అధికారిక సమాచారం.. లీకుల సమాచారం ఇచ్చి ఎక్కువగా ప్రచారం చేయడానికే ఆసక్తి చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  మూడు రోజుల కస్టడీలో అఖిలప్రియను ఏం అడిగారో.. ఏం చెప్పిందో.. అప్ టూ డేట్ కొన్ని చానళ్లలో వచ్చేస్తూ ఉంది. అది నిజమో…కాదో ఎవరికీ తెలియదు. కానీ పోలీసులు మాత్రం.. ఆ తరహా లీకులు ఇస్తున్నారు. అదే సమయంలో… నిందితుల్ని పట్టుకోవడంలో మాత్రం ఫెయిలవుతున్నారు. అక్కడ నుంచి తప్పించుకున్నారు.. ఇక్కడి నుంచి తప్పించుకున్నారు అంటూ…  ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి హైదరాబాద్‌లో భూవివాదాలతో ఎన్నో కేసులు వస్తూంటాయి. దేన్నీ పట్టించుకోని పోలీసులు అఖిలప్రియ కిడ్నాప్ వ్యవహారంలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉన్నారు. దీనికి కారణం ఆ భూమి ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉందో..వారి ఒత్తిడేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీం చెప్పినా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వెంకట్రామిరెడ్డి..!

ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి .. ఎస్ఈసీ నిమ్మగడ్డను చంపే హక్కు కూడా ఉందన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తన మాటలు వక్రీకరించారని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మరింత వివాదాస్పదమైన...

వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్...

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

HOT NEWS

[X] Close
[X] Close