క్రైమ్ : కుమారులతో కలిసి భర్త హత్య..! ఎందుకంటే..?

ఓ సినిమాలో కామెడీ సీన్ ఉంటుంది. నేను తెలియక మా ఆవిడ అనుకుని మీ ఆవిడను వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నాను మీరేమీ ఫీలవరు కదా…! అని అడుగుతూ ఉంటుంది ఏవీఎస్ లాంటి క్యారెక్టర్. తానేమీ ఫీల్ కానని బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్ చెప్పినా.. ఆ ఏవీఎస్ మాత్రం ఊర్లో అందరికీ చెబుతూ ఉంటాడు.. ఇప్పుడు ఆ బ్రహ్మానందం పరిస్థితి ఏమిటి..?. సినిమా కాబట్టి ఇది కామెడీగా తీశారు. రియల్‌గా ఆలోచిస్తే… అలాచెప్పే ఏవీఎస్‌ను చంపేయాలన్నంత కోపం.. సదరు బ్రహ్మానందం క్యారెక్టర్‌కి వస్తుంది. వచ్చింది.. చంపేశారు కూడా. తెలంగాణలోని జహీరాబాద్‌లో జరిగిన ఓ హత్య కేసును చేధించిన పోలీసులకు కారణం తెలిసి అవాక్కయ్యారు.

ఐదు రోజుల కిందట… జహీరాబాద్ సమీపంలో ఓ చెక్‌డ్యాంలో గుర్తు తెలియని మృతదేహాం బయటపడింది. అది దారుణహత్య.   కాళ్లు, చేతులు, మొండెం వేరుచేసి ఓ సంచిలో మూటగట్టి చెక్‌డ్యాంలో పడేశారు.  ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ముందుగా హతుడెవరో గుర్తించారు. అతని జహీరాబాద్ శివారులో కర్ణాటకలోకి వచ్చే  ఓ గ్రామానికి చెందిన వైద్యనాథ్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఆ తర్వాత కేసు విషయాన్ని తేలిగ్గానే తేల్చేశారు. ఆ తర్వాత నిందితుల్ని కూడా పట్టుకున్నారు. అంతా తేలాక నిందితులు ఎవరంటే.. వైద్యనాథ్ భార్య, పిల్లలు. ఎందుకు చంపారో కారణం తెలుసుకుని పోలీసులు కూడా నోరెళ్లబెట్టాల్సి వచ్చంది.

పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ.. వైద్యనాథ్‌కు భార్యపై అనుమానం. ఆమెకు ఎవరితోనే వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ ఉంటారు. ఆ అనుమాన వేధింపులు ఇంట్లోనే ఉంటే… ఎలాగోలా సర్దుకునేవారేమో..? కానీ ఇంటి గుట్టును ఊళ్లో పెట్టేశాడు. ఊళ్లో అందరికీ చెప్పి… ప్రచారం చేయడం ప్రారంభించాడు. దీంతో కుటుంబం పరువు పోతుందని విసుగు చెందిన భార్య, కుమారులతో కలిసి హత్య చేసింది. వైద్యనాథ్‌ను ఇంటిలో బంధించి.. తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం తల, కాళ్లు, చేతులు వేరు చేసి ఓ సంచిలో కుక్కి తెలంగాణ సరిహద్దు గ్రామంలోకి తెచ్చి పడేశారు. చివరికి పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీం చెప్పినా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వెంకట్రామిరెడ్డి..!

ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి .. ఎస్ఈసీ నిమ్మగడ్డను చంపే హక్కు కూడా ఉందన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తన మాటలు వక్రీకరించారని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మరింత వివాదాస్పదమైన...

వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్...

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

HOT NEWS

[X] Close
[X] Close