ఓ పాస్టర్‌ను అరెస్ట్‌ చేసిన ఏపీ పోలీసులు..!

ఆంధ్రప్రదేశ్‌లో మత అలజడి రేపాలని ప్రయత్నిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడంటూ… పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సోడదశి ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్‌ను అరెస్ట్ చేశారు. ఆయన బెంగూళురు గాసిప్స్ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ పెట్టుకుని అందులో హిందూ దేవుళ్లను తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల…  ఏపీలోజరుగుతున్న ఆలయాలపై దాడుల గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. విగ్రహ ఆరాధాన వల్ల ఏమీ ఉపయోగడం ఉండదని.. వాటిని ధ్వంసం చేసిన తప్పు లేదని.. తాను స్వయంగా చాలా విగ్రహాలను ధ్వంసం చేశానని ప్రవీణ్ కుమార్ వీడియోల్లో చెప్పుకున్నాడు.

దీనిపై సీఐడీ పోలీసులకు ఫిర్యాదు రావడంతో తక్షణమే స్పందించి.. అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. అంతే కాదు.. ఓ హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎవరైనా మత సామరస్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేదిలేదని ప్రకటించారు.  ఇప్పటి వరకూ పోలీసులు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎవరికైనా కేసులు పెట్టలేదు. అనేకానేక వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్న లెక్కలోకి తీసుకోవడం లేదు. దీనిపై బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో.. హఠాత్తుగా.. ఓ  వ్యక్తి నుంచి ఫిర్యాదు తీసుకుని ప్రవీణ్ కుమార్ అనే పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ ప్రవీణ్ కుమార్‌కు ఇదే బిజినెస్. హిందూదేవుళ్లను తిడుతూ.. మత మార్పిళ్లు చేయడమే వ్యాపారంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే అతనిపై నాలుగు కేసులు.. సైబర్ బుల్లిషీట్ కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. విమర్శలొచ్చినప్పుడు కంటి తుడుపు చర్యలు తీసుకోవడ కాకుండా.. సమస్య పరిష్కారం కోసం పోలీసులు శాశ్వతచర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం మాత్రం అంతటా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close