సాక్ష్యాల కోసం అర్థరాత్రి టీడీపీ నేతలకు పోలీసుల నోటీసులు !

ఆంధ్రప్రదేశ్ పోలీసులు అత్యంత సిన్సియర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇంటి పక్కన జరిగిన ఓ అత్యాచార కేసులో నిందితుడైన వెంకటరెడ్డిని ఇంత వరకూ పట్టుకోలేకపోయిన పోలీసులు … పట్టిస్తే డబ్బులిస్తామంటూ పేపర్ ప్రకటనలు చేస్తున్నారు. కానీ టీడీపీ నేతల ఇళ్లకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం అర్థరాత్రుళ్లు.. తెల్లవారుజామున వెళ్లిపోతున్నారు. గతంలో ఉదయమే కాకినాడ నుంచి పొన్నూరు వెళ్లిన పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఆర్థరాత్రి విశాఖ పోలీసులు గుటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద హంగామా సృష్టించారు.

నోటీసులు ఇవ్వడానికి అర్థరాత్రి నిద్ర లేపాలా అని అందరూ ఆశ్చర్యపోయారు కానీ పోలీసులకు అవేమీ పట్టలేదు.తమ డ్యూటీ తాము చేయడానికి వచ్చామని చెప్పుకున్నారు. దీంతో ఆశ్చర్యపోవాల్సిన వంతు టీడీపీ నేతలకు ఎదురయింది. నక్కా ఆనందబాబుకు నోటీసులు ఎందుకంటే .. రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ ఇతర అంశాలపై వైసీపీ నేతలపై ఆరోపణలు చేయడమే. ఆ ఆరోపణలు చేసినందుకు సాక్ష్యాలు ఇవ్వాలంటూ ఇలా నోటీసులు జారీ చేస్తున్నారు పోలీసులు.

పోలీసులు అసలు నేరాలను పక్కన పెట్టి ఇలా రాజకీయ డ్యూటీలు చేయడం వల్లే ఏపీలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నిందితుల్ని పట్టుకోలేక పేపర్ ప్రకటనలు ఇస్తున్నారని.. నోటీసులు ఇవ్వడానికి మాత్రం అర్థరాత్రి .. అపరాత్రి వస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఏపీ పోలీసులకు ఇవన్నీ కామన్ అయిపోయాయి. వారికి వచ్చే ఆదేశాల ప్రకారం వారు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close