ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ డంపులు దొరికిన చోటల్లా.. పెద్ద పెద్ద లోడ్లు కనిపిస్తున్నాయి. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా.. తన నియోజకవర్గంలోని ఓ కాలేజీలో దాచి పెట్టిన మద్యం డంప్ ను సొంత పార్టీ నేతలు పట్టించారు.
మొత్తం 250 కేసుల మద్యం అందులో ఒక్కొక్కటి 48 బాటిల్స్ ఉంటాయి. ఇలాంటివి ఎన్ని చోట్ల దాచారో కానీ.. ఓ డంప్ గురించి సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. రోజా వర్గీయులు నలుగుర్ని అరెస్టు చేశారు. నామినేషన్ కార్యక్రమం కోసం తీసుకొచ్చే జనాలకు పంచేందుకు రోజా ఈ మద్యాన్ని రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
భారీగా మద్యం దొరికినా రోజా అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు వెనుకాడుతున్నారు. కేసుల్లేకుండా చేయడానికి రోజా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గం మొత్తం సొంత పార్టీలోనే వ్యతిరేకుల్ని పెట్టుకుని రోజా రాజకీయం చేయడం అసాధ్యంగా మారింది. ఏ పని చేద్దామని ముందే పోలీసులకు సమాచారం వెళ్తోంది. దీంతో మొదటికే మోసం వస్తోంది.