అపర చాణక్య కేసీఆర్‌తో నేతల పరిహాసాలు !

అపర చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ కు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎంతగా అంటే మీకు ఇక రాజకీయ భవిష్యత్ లేదు… మీ పార్టీలో ఉండలేను అని మొహం మీద చెప్పెసి వెళ్తున్నారు సీనియర్ లీడర్లు. పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తే… బాపూ అంటూ ఆనందభాష్పాలు కార్చి వెళ్లిన వాళ్లు .. .మీరు చాలా తప్పులు చేశారు జనాదరణ లేదు.. మీ పార్టీకో దండం అని నిందలు వేస్తూ లేఖలు రాస్తున్నారు.

పార్టీకి భవిష్యత్ లేదని తన కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ లో చేరుతున్నానని కేకే ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ మొహం మీదనే చెప్పేసి వచ్చారు. ఆయన వచ్చిన కాసేపటికి కడియం శ్రీహరి కూతురు వరంగల్ కు తనకు ఇచ్చిన టిక్కెట్ అక్కర్లేదని లేఖ రాశారు. కడియం, ఆయన కూతురు కాంగ్రెస్ లో చేరిపోనున్నారు. వీరే ప్రారంభం కాదు.. అంతం కాదు. గత రెండు నెలలు పోయే వాళ్లు ఎంత మంది ఉన్నారో లెక్కలేదు. గేట్లు తెరిచినట్లుగా రేవంత్ ప్రకటించిన తర్వాత ఆపడం ఎవరి తరం కావడం లేదు.

నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తే చాలు గెలిచిపోతామని అనుకునేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చినా ఎందుకూ పనికి రాదని వదిలేసిపోతున్నారు. లోక్ సభ అభ్యర్థుల్లో పదమూడు మంది కొత్త వాళ్లను పెట్టారు. వారిలో ఏ విధంగా చూసినా ఎంపీ స్థాయి నేతలు ఎవరూ లేరు. అతి కష్టం మీద ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మాత్రం ఒప్పించగలిగారు. వారికి ఇతర చోట్ల ఆఫర్ లేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే వారు కూడా ఉండేవారు కాదు.

కేసీఆర్ అంటే చాణక్యుడు… ఇంట్లో కూర్చుని మాటలతోనే రాజకీయం మార్చేస్తారని భావిస్తారు. కానీ ఆయన చాణక్యం అంతా ఇప్పుడు ఎటు పోయిందో కానీ.. పార్టీ నేతల్ని నిలుపుకోలేకపోతున్నారు. టిక్కెట్లు ఇచ్చిన వారూ ఉండలేకపోయారు. అధికారం ఉన్నప్పుడు ఆయన కరుణాకటాక్షల కోసం తిరిగిన నేతలు.. ఇప్పుడు ఆయన ఓ లీడరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ చాణక్యం గెలిచినప్పుడే వర్కవుట్ అవుతుందని అనుకోవాలేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close