ఫ్యాక్షన్‌ అణిచివేత.. ప్రజాసేవ..! పల్నాటి పులి కోడెల..!

పల్నాటి పులి కోడెల. ఈ మాట .. మాట వరుసకు అనేది కాదు. నిడందా పల్నాటి పులి కోడెల. ప్రస్తుత తరానికి ఆయన గురించి తెలిసింది తక్కువే. కానీ ఆయన నేపధ్యం..రాజకీయ ఆరంగేట్రం… శక్తివంతమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొన్న వైనం… తెలిసిన వారు…పులిగా అభివర్ణిస్తే.. ఖండించరు.

1980 ప్రాంతాల్లో… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తప్ప మరో పార్టీకి ఉనికి ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఎక్కడికక్కడ సంఘవిద్రోహశక్తులుగా.. ఫ్యాక్షనిస్టులుగా.. ఊళ్లను ఊళ్లు గుప్పిట్లో పెట్టుకుని… పరిపాలించేవారు. పల్నాడులోనూ అదే పరిస్థితి. అలాంటి సమయంలో..1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత…పల్నాడులో అప్పటికే పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నేతల్ని… ఫ్యాక్షనిస్టు తరహా రాజకీయాల్ని ఎదుర్కోవాలంటే… యువరక్తం కావాలనుకున్నారు. పల్నాడులో అత్యంత భయానక పరిస్థితులు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎవరు ఎదురు తిరిగినా.. వారు సాగర్ కాలవల్లో శవాలుగా కనిపించే భయానక వాతావరణం ఉండేది. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ప్రజలకు ధైర్యం కల్పించాలంటే… గుండె ధైర్యం… ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం ఉన్న నేత కావాలని ఎన్టీఆర్ చూశారు.

ఆ సమయంలో… అప్పటికే వైద్య విద్య పూర్తి చేసి నర్సరావుపేటలో ఆస్పత్రి నిర్వహిస్తున్న కోడెలపై ఎన్టీఆర్ దృష్టి పడింది. ఆయనకు పార్టీ నేతలతో సమాచారం పంపారు. మొదటగా ఆసక్తి చూపకపోయినా… ఎన్టీఆర్ తర్వాత గుంటూరు పర్యటనకు వచ్చినప్పుడు… స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలా 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటికే పల్నాడు గ్రామాల్లో పాతుకుపోయిన ఫ్యాక్షన్ సంస్కృతిని ఎదుర్కొంటూ..పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ..ప్రజా నేతగా ఎదిగారు. మొత్తంగా ఐదు సార్లు నర్సరావుపేట నుంచి విజయం సాధించారు. మామూలుగా అయితే.. ఇప్పటికీ ఆయనకు నర్సరావుపేటలో తిరుగు ఉండదు. కానీ 2004 ఎన్నికల సమయంలో… నియోజకవర్గాల పునర్విభజనతో… ఆయన కంచుకోటల్ని… టీడీపీ మద్దతుదారులు అధికంగా ఉండే గ్రామాలను.. చివరికి స్వగ్రామాన్ని కూడా… పొరుగు నియోజకవర్గాలైన చిలుకలూరిపేట, సత్తెనపల్లిల్లో కలిపేశారు.

దాంతో ఆయన రెండు సార్లు వరుసగా పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా.. బీజేపీకి నర్సరావుపేట కేటాయించడంతో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. స్పీకర్ గా ఉన్న కోడెలను.. టార్గెట చేసి..కే ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారని.. వైసీపీ విపరీతంగా ప్రచారం చేయడంతో.. గత ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అప్పటికే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపారు. 1985లోనే ఎన్టీఆర్ హయాంలో ఆయన హోంమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్,చంద్రబాబు మంత్రివర్గాల్లో పంచాయతీరాజ్, వైద్యఆరోగ్యశాఖ సహా అనేక శాఖలు నిర్వహించారు. కోడెల అంటే పల్నాడు ప్రజలకు విపరీతమైన అభిమానం. ఆయన ఆ విధంగా సేవలు అందించారు.

పల్నాడులో ఈ రోజు ఉన్న తాగునీటి వ్యవస్థ ఆయన పుణ్యమే. ఓ గుట్టపై ఓమామూలు ఆలయంగా ఉన్న కోటప్పకొండను..రాష్ట్ర స్థాయి ఆలయంగా తీర్చిదిద్ది.. శివరాత్రి అంటే..కోటప్ప కొండ అన్నట్లుగా…మార్చింది కూడా కోడెల శివప్రసాదరావు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా… ఆయన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రపంచరికార్డు సృష్టించారు. ఓ వైపు కార్యకర్తల్ని కాపాడుకునే క్రమంలో.. డైనమిక్ గా వ్యవహరిస్తూ.. దాడులకు తెగబడినా.. ఎదురెళ్లిన కోడెల… పల్నాటి పులిగా..తన చరిత్రను లిఖించుకున్నారు. కానీ.. 72 ఏళ్ల వయసులో రాజకీయ వేధింపులను భరించలేక.. బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమే… విషాదాంతం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close