ఐదేళ్లు : రాజకీయ కుట్రల్లో నలిగిపోతున్న అమరావతి..!

ఐదేళ్ల క్రితం..ఇదే రోజు. రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం. రాజధాని లేని రాష్ట్రానికి ఓ రాజధానిని నిర్మించుకుంటున్నఆనందం.. రాష్ట్రం మొత్తం కనిపిస్తోంది. ఎక్కడా… ప్రాంతీయ విబేధాలు లేవు. అందరూ.. మనస్ఫూర్తిగా రాజధానిని స్వాగతించారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా స్వాగతించారు. ప్రధాని చేతుల మీదుగా .. అంగరంగ వైభవంగా ఆ ఉత్సవం సాగింది. ప్రపంచంలో మేటి రాజధాని కావాలని మోడీ ఆశీర్వదించారు. కానీ ఇప్పుడేమయింది..?. దీనికి ఎవరు కారణం..?

ఆ వేగంతో నిర్మాణాలు కొనసాగి ఉంటే గ్రాఫిక్స్ నిజమయ్యేవి.. !

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా రాజధానిని నిర్ణయించి.. భూసమీకరణ చేసి.. శంకుస్థాపన చేసే సమయానికి పదహారు నెలలు గడిచింది. అప్పుడే కొంత మంది ఎన్టీటీలో పిటిషన్లు వేశారు. ఆ కారణంగా కొండవీడు ఎత్తిపోతల నిర్మించిన తర్వాతే రాజధాని నిర్మాణం చేపట్టాలని ఎన్జీటీ ఆదేశించింది. ఆ ఆదేశాలతో శరవేగంగా ఎత్తిపోతల నిర్మించారు. నిర్మాణాలు ప్రారంభించేసరికి..మరో ఏడాదిగడిచిపోయింది. ఆ తర్వాత రెండున్నరేళ్లలోనే… అమరావతి ఓ రూపానికి వచ్చింది. ఇప్పుడు.. అమరావతిలో కనించేవన్నీ.. అకొద్ది కాలంలో నిర్మించినవే. ఆ వేగంతో కొనసాగించి ఉంటే.. ఈ పాటికి అమరావతికి ఓ రూపానికి వచ్చేది.. ప్రజారాజధానిగా.. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉండేది. కానీ ఇప్పుడా ఆశల సౌధం కుప్పకూలిపోయింది. కొత్త ప్రభుత్వం ఆమరావతి ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నంలో బిజీగా ఉంది. స్వయం నాశనం అనే పదానికి విస్తృతమైన అర్థం తెలియచెబుతున్నారు.

నాడు బాసలు చేసిన మోడీ నేడు వ్యూహం మార్చుకున్నారు..!

అమరావతి రాజధానికి ప్రధానమంత్రి మోడీ వచ్చారు. ఢిల్లీ నుంచొచ్చిన ఆయన ప్రజాస్వామ్యానికి మందిరం వంటి పార్లమెంట్ వద్ద సేకరించిన పవిత్ర మట్టిని తీసుకొచ్చానని, మన సంస్కృతికి, నాగరికత లకు ప్రతిబింబాలు మన నదులు అని పేర్కొన్నారు. అందుకే పవిత్ర యమునా నది నుంచి పవిత్ర జలాన్ని తెచ్చానని ప్రధాని ప్రకటించారు. ఢిల్లీని తలదన్నే విధంగా ఏపీ రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రధాని మోడీ ఐదు కోట్ల ఆంధ్రులకు ఆనాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ సర్కార్ పనులకు మద్దతు పలుకుతున్నారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేదంటున్నారు. అధికార పార్టీతో రాజకీయ ప్రయోజనాల కోసం లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని… దేశానికే నష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు చెప్పినా కేంద్రం చెవికెక్కించుకోవడం లేదు.

సొంత రాజధానిపై కుట్రలు చేసుకునే మేధావులు ఆంధ్రులు..!

అమరావతిపై ఓ ముద్ర వేసి.. రాజకీయ ప్రయోజనాలు సాధించేశారు స్వార్థ రాజకీయ నాయకులు. దేశంలో ఏ రాజధానిపైనా వేయని నిందలు వేశారు. అది కూడా సొంత ప్రజల్ని మభ్య పెట్టి. ఇతర రాష్ట్రాలు.. ఇతర దేశాలు అభివృద్ధి కోసం.. కలసి కట్టుగా ప్రయత్నిస్తాయి.. కానీ ఏపీలో మాత్రం.. కులం, ప్రాంతాలను బూచిగా చూపి.. ఒకరి ఆర్థిక పునాదుల్ని మరొకరు కూల్చుకుంటూ ఉంటారు. ఆక్రమంలో అమరావతి నిర్వీర్యమైపోయింది. భావి ఆంధ్రుల పిల్లలకు బంగారు భవిష్యత్ కనుమరుగయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

`వైల్డ్ డాగ్`… ప్లాన్ బి ఉందా?

నాగార్జున న‌టించిన సినిమా `వైల్డ్ డాగ్‌`. పూర్తి స్థాయి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈసినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని...

“ఉద్రిక్తతలు” లేకుండా కేసీఆర్ ప్రచారసభ..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారసభలో వ్యూహాత్మక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఆయన తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతారని అందరూ అనుకున్నారు....

ప్రకాష్‌రాజ్‌ సద్విమర్శనూ పాజిటివ్‌గా తీసుకోలేరా..!?

పవన్ కల్యాణ్ రాజకీయ గమనాన్ని..నిర్ణయాల్ని విమర్శించిన ప్రకాష్‌రాజ్‌పై.. పవన్ కల్యాణ్ క్యాంప్ భగ్గుమంది. జనసైనికులు ఎన్నెన్ని మాటలు ‌అన్నా.. జనసేనాని సోదరుడు నాగబాబు చేసిన విమర్శలు మాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సినవే. కానీ ప్రకాష్‌రాజ్‌ను...

నవరత్నాలు ఆపేయమని జగన్‌కు ఉండవల్లి సలహా..!

జగన్ శ్రేయోభిలాషిగా అందరికీ గుర్తుండే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలి కాలంలో ప్రెస్‌మీట్లు పెట్టి.. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఆయన చేస్తున్న తప్పులను కరెక్ట్ చేసి.. ఆయనకు మేలు చేద్దామన్న...

HOT NEWS

[X] Close
[X] Close