ఏకగ్రీవాలు రద్దు చేయాలన్నదే విపక్షాల డిమాండ్.. !

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడాన్ని ఒక్క అధికార పార్టీ మినహా విపక్షాలన్నీ స్వాగతించాయి. అంతే కాదు పాత ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. గతంలో పార్టీలతో ఎస్‌ఈసీ నిర్వహించిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమయింది. ఇప్పుడు కూడా అదే అభిప్రాయాన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎస్ఈసీ గతంలో నోటిఫికేషన్ విడుదల కాని పంచాయతీ ఎన్నికలను మాత్రమే రీ షెడ్యూల్ చేసి పెడుతున్నారు. నామినేషన్ల వరకూ వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ల ఎన్నికల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వాయిదా వేసే వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియపై ఎస్‌ఈసీ సంతృప్తిగా లేరనే విషయం కేంద్ర హోంశాఖకు ఆయన రాసిన లేఖ ద్వారానే తేలిపోయింది. దాడులు , దౌర్జన్యాల ద్వారా అత్యధికంగా ఏకగ్రీవాలు చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏకపక్షంగా పని చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇప్పుడు.. మళ్లీ ఆ ఎన్నికల గురించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే .. ఎస్‌ఈసీ ఆ ప్రక్రియ మొత్తం రద్దు చేసి మళ్లీ ఫ్రెష్‌గా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిపితే ఎస్‌ఈసీ అదే నిర్ణయం తీసుకుంటారని.. అందుకే సుప్రీంకోర్టుకు అయినా వెళ్లి స్టే తీసుకు రావాలని ప్రభుత్వం అనుకుంటోందంటున్నారు.

ఎన్నికలు జరిగితే స్వీప్ చేస్తామని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికలు జరగకుండానే స్వీప్ చేస్తారని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగి ప్రజలు ఓట్లేసి.. స్వీప్ చేయడం వేరు.. అసలు ఎన్నికలు జరగకుండా.. పోటీ దారులు లేకుండా చేసుకుని స్వీప్ చేయడం వేరు. ప్రభుత్వం రెండో దానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికలు జరగాలని… ప్రజలందరూ ఓట్లేయని విపక్షం కోరుకుంటోంది. మార్చి నెలాఖరులో పదవీ విరమణ చేయబోయే ఎస్‌ఈసీ ఎన్నికలన్నింటినీ నిర్వహించేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే జరిగితే.. వైసీపీ స్వీప్ చేసినా… ఎస్‌ఈసీచేతిలో ఓడిపోయినట్లే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెగిటీవ్ రోల్స్ చేస్తేనే స‌త్తా తెలిసేది: లావ‌ణ్య త్రిపాఠీతో ఇంట‌ర్వ్యూ

`నా నుంచి మీరు కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు` కింగ్ లో బ్ర‌హ్మానందం డైలాగ్ ఇది. ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. `క్యారెక్ట‌ర్ కొత్త‌గా లేక‌పోతే... ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు` అనే విష‌యాన్ని గుర్తిస్తున్నారు....

ధర్డ్ ఫ్రంట్ పెట్టేసుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న కమల్..!

తమిళనాడు ఎన్నికల్లో తనను ఎవరూ పట్టించుకపోయినా కమల్ హాసన్ మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన బలం తేలిపోవడంతో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన పార్టీలు...

బీజేపీ పరిస్థితి బాగోలేదనే సర్వేలేమీ బయటకు రాలేదా..!?

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల ఏడో తేదీన వస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ ఎన్నికల ప్రచారసభలో హింట్ ఇచ్చినా అది విపక్షాలను...

సాగర్‌లో బీజేపీది దుబ్బాకలో కాంగ్రెస్ పరిస్థితే..!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సారిగా వచ్చిన ఊపు.. ఆ పార్టీకి చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. నాగార్జున సాగర్‌లో పోటీ చేసేది తామంటే తాము అని పోటీ పడుతూండటంతో కాంగ్రెస్...

HOT NEWS

[X] Close
[X] Close