టీఆర్ఎస్ “సైలెంట్ బ్యాచ్” మనోగతమేంటి..!?

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు నాయకత్వ మార్పు చర్చ విస్తృతంగా జరుగుతోంది. కాబోయే సీఎం కేటీఆర్ అని పొగడ్తలు కురిపించడానికి పోటీ పడుతున్నారు. ఆయన గుడ్ లుక్స్‌లో పడేందుకు ఇప్పటి వరకూ పెద్దగా ప్రాధాన్య పోస్టులు పొందని టీఆర్ఎస్ నేతలు… మంత్రి అయిపోవాలనుకునే ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అయితే అందరూ కాదు. కొంత మంది సైలెంట్‌గా ఉంటున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిపై చాలా మంది సీనియర్లు ఇంకాతమ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఈటల లాంటి ఒకరిద్దరు తప్ప… అనేక మంది తమ అభిప్రాయాల్ని బహిరంగంగా చెప్పాల్సి ఉంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన బీటీ బ్యాచ్‌గా పేర్కొనే బంగారు తెలంగాణ బ్యాచ్ మాత్రం.. కేటీఆర్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది.

ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన వారు ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రాలేదు. వారంతా సీనియర్లు. కేసీఆర్‌తో కలిసి పని చేసిన వారు. వారంతా.. మనస్ఫూర్తిగా కేటీఆర్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నగా మారింది. కొంత మంది అది తమ అంతర్గత విషయంగా చెబుతున్నారు. మరికొంత మంది ఇప్పటికీ నోరు మెదపడం లేదు. ముఖ్యంగా హరీష్ రావు ఇంత వరకూ స్పందించలేదు. ఆయన స్పందన కోసం.. టీఆర్ఎస్‌లోనే కాదు.. ఇతర పార్టీల నేతలూ ఎదురు చూస్తున్నారు. మామూలుగా అయితే ఉద్యమ కాలం నుంచి… అధికారంలోకి వచ్చే వరకూ వెన్నుముకగా నిలిచిన నేత హరీష్ రావు. ఆయనకు పార్టీలో ఓ ప్రత్యేకమైన మద్దతుదారులైన వర్గం ఉంది. వారంతా ప్రస్తుత పరిస్థితుల కారణంగా బయటపడలేకపోవచ్చు కానీ.. సందర్భం వస్తే.. అంతా హరీష్ వైపే చేరుతారని టీఆర్ఎస్‌లో అందరికీ తెలుసు.

అందుకే ఇప్పుడు హరీష్ రావు.. కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే.. ఆయన కేబినెట్‌లో చేస్తారా… మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా అన్న డౌట్ ఉంది. అలాగే.. అసలు హరీష్‌కు కేటీఆర్ కేబినెట్‌లో చోటు దక్కకపోతే పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా నడుస్తోంది. హరీష్‌తో పాటు మరికొంత మంది సీనియర్ నేతల స్పందన బయటకు రావాల్సి ఉంది. మొహమాటానికి కాకుండా… కేటీఆర్‌కు అందరూ మనస్ఫూర్తిగా మద్దతిస్తే.. కేసీఆర్ ఓ భారీ సవాల్‌ను అధిగమించినట్లే అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close