వైసీపీ అదినేత పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ నేతల సమావేశంలో పాల్గొన్నారని వైసీపీ మీడియా విభాగం.. ఫోటోలు విడుదల చేసింది. ఆ ఫోటోలను చూసి వైసీపీ క్యాడర్ కూ మైండ్ బ్లాంక్ అయింది. చింపిరి గడ్డంతో కనిపించినా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా నవ్వుతున్నట్లుగా.. ఏ బాధ లేదనట్లుగా కొన్ని స్నాప్స్ తీసి మీడియాకు పంపించారు. అందులో ప్రతి ఫోటోలనూ బొట్టు ప్రముఖంగా కనిపించేలా.. తీశారు. ఈ బొట్టు కథ ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఎవరైనా మగవాళ్లు బొట్టు పెట్టుకోవాలంటే గుడికి వెళ్లి ఉండాలి..లేదా ఇంట్లో పూజ చేసుకుని ఉండాలి.కానీ జగన్ రెడ్డి ఇంట్లో హిందూ దేవుళ్ల ఫోటోలు ఉండవు.. ఆయన గుడికి వెళ్లరు. మరి బొట్టు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎందుకు వచ్చింది అన్నదే ఎక్కువ మందికి సందేహం. అలా అడిగే ధైర్యం అక్కడ ఉన్న పార్టీ నేతలకు లేదు. అలా అడిగేవారంటే అక్కడికి రానివ్వరు. సోమవారం గవర్నర్ వద్దకు వెళ్లి.. తనను కాపాడాలని బీజేపీ పెద్దలకు ఓ పిటిషన్ పెట్టుకుని వచ్చారేమో కానీ.. తాను దేనికైనా సిద్ధమని ఈ బొట్టు ద్వారా సంకేతాలు పంపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ రెడ్డి అందితే జుట్టు అందితే కాళ్లు పట్టుకునే రకం. తనకు అధికారం ఉన్నప్పుడు ఎవరికైనా అరెస్టు చేయిస్తామంటారు. అధికారం లేకపోతే తనను అరెస్టు చేయనివ్వొద్దని దేనికైనా సిద్ధమని కాళ్లు పట్టేసుకుంటారు. లిక్కర్ స్కామ్ లో తన అరెస్టు ఖాయమని.. విషయం.. భారిత రెడ్డి వరకూ వెళ్తోందని తెలిసిన తర్వాతే జగన్ లో ఆందోళన ప్రారంభమయింది. ఏదో విధంగా తనను కాపాడే వారి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనను నమ్మేవారెవరు?