బీహార్ లో ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీకి ఎప్పట్లాగే ఘోరపరాభవం ఎదురయింది. కానీ అసలు ఖర్చు అయిపోయింది మాత్రం తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ వద్ద మార్కులు కొట్టేయడానికి, భవిష్యత్ లో తానే కీలకంగా మారడానికి పొంగులేటి బీహార్ బాధ్యత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. మల్లిఖార్జున్ ఖర్గే ద్వారా బీహార్ ఖర్చు అంతా తానే పెట్టుకుంటానని హైకమాండ్ కు ద్వారా ఒప్పించుకుని రంగంలోకి దిగారని అంటున్నారు.
బీహార్ ఎన్నికల్లో పొంగులేటి డీప్ గా ఇన్వాల్వ్ అయ్యారని అంటున్నారు. ఢిల్లీలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ వార్ రూమ్ ద్వారా ఆయన మొత్తం వ్యవహాహారాలు నడిపించారు. ఆర్జేడీని పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 61 నియోజకవర్గాల్లోనూ ఆయన అన్ని ఖర్చులు చూసుకున్నారని చెబుతున్నారు.
నిజానికి దక్షిణాదిలో పెట్టాల్సినంత ఖర్చు బీహార్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఓ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాల్సినంత అక్కడ ఖర్చు పెడితే సరిపోతుంది. ఎలా లేదన్నా.. రెండు, మూడు వందల కోట్లు అయినా ఖర్చు అయి ఉంటారని అంటున్నారు. అయితే ఫలితాలు మాత్రం తేడా వచ్చాయి. అందుకే పొంగులేటికి అయ్యయ్యో జేబులో డబ్బులు పోయేనే అనే జాలి చూపించాల్సిన పరిస్థితి వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. మొత్తం ఫైనాన్సింగ్ మొత్తం ఆయనే చేయడంతో హైకమాండ్ కూడా ఆయనపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోందని అంటున్నారు. అదే నిజమైతే పొంగులేటికి.. పెట్టిన పెట్టుబడికి తగ్గ లాభం వచ్చినట్లే అనుకోవాలి.