బికినీ సీన్ గురించి పూజా హెగ్డే ఆన్సర్

రెండు సినిమాలు చేసిందో లేదో… పూజా హెగ్డేకి క‌థానాయిక ల‌క్ష‌ణాల‌న్నీ బాగా అబ్బేశాయి. ఎక్క‌డ ఎలా మాట్లాడాలో.. నేర్చేసుకొంది. ‘గ్లామ‌ర్‌’ మంత్రం జ‌పించ‌డం త‌ప్పు కాద‌న్న విష‌యం ఇంత త్వ‌ర‌గా పూజా నేర్చేసుకొంటుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. డీజేలో పూజాని చూసి అంతా షాక్ తిన్నారు. బికినీ సీన్‌లో అయితే… నోరెళ్ల బెట్టేశారు. అది చూసి సెన్సార్ వాళ్లు కూడా బ్ల‌ర్‌లు వేసుకోవాల్సివ‌చ్చింది. ”మూడో సినిమాకే ఇంత హాట్ హాట్‌గా రెచ్చిపోయేంటి?” అని అడిగితే సెన్సార్ వాళ్లిచ్చిన బ్ల‌ర్‌లు సైతం బావురుమ‌నే ఆన్స‌ర్ ఒక‌టిచ్చింది.

”డీజే క‌థ‌లో, ఆ సీన్‌.. బికినీ డిమాండ్ చేసింది. క‌థానాయ‌కుడు షాక్ అయ్యేలా చేయాలంటే.. క‌థానాయిక ఆ స‌మ‌యంలో అంత హాట్ గా క‌నిపించాల్సిందే. సీన్ డిమాండ్ చేసింది కాబ‌ట్టి బికినీ వేశా. ఆ సీన్‌లో బికినీ వేయ‌క‌పోతేనే త‌ప్పు..” అంటూ తెలివిగా స‌మాధానం చెబుతోంది. సెన్సార్ వాళ్లు కూడా బ్ల‌ర్‌లు వేశారు తెలిసిందా? అని అడిగితే… ”అవును.. ఈ సినిమాని నేను థియేట‌ర్లో చూశా. కాక‌పోతే సెన్సార్ వాళ్లు క‌ట్ చేస్తార‌నో, బ్ల‌ర్‌లు వేస్తార‌నో కూర్చుంటే ఏం చేయ‌లేం. బికినీ అనేది గ్లామ‌ర్‌లో ఓ భాగం. అందులో నాకైతే ఏ త‌ప్పు క‌నిపించ‌డం లేదు” అనేసింది. న‌ట‌న మాటెలా ఉన్నా.. త‌న అంద‌చందాల‌తో డీజేలో అద‌ర‌గొట్టేసింది పూజా. భ‌విష్య‌త్తులోనూ ఇంతే హాట్ గా, ఆ మాట‌కొస్తే ఇంత‌కంటే ఎక్కువ‌గా క‌నిపించే ఛాన్స్ ఉంద‌ని, ఆమె మాట‌లే చెప్పేస్తున్నాయి. సో… హాట్ హాట్ భామ‌ల‌కు గట్టి పోటీగ‌త్తె ఒక‌టి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన‌ట్టే అనుకోవాలేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.