పూజా డామినేష‌న్ మొద‌లైపోయిందిగా!

అఖిల్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడిప్పుడు. ఏదో ఓ రూపంలో త‌న‌కు ఓ విజ‌యం ద‌క్కాలి. అంతే. లేదంటే మ‌రోసారి ‘రీ రీ రీ రీ ఎంట్రీ’ చేయించుకోవాల్సివ‌స్తుంది. త‌న ఆశ‌ల‌న్నీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’పైనే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఎన్ని లుక్కులు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఇంపాక్ట్ క్రియేట్ చేయ‌లేదు. జ‌నాల ఫోక‌స్ ఈ సినిమా వైపు ప‌డలేదు. ఈరోజు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌’ నుంచి ఓ పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాని గురించి మాత్రం.. అంద‌రూ మాట్లాడుకోవ‌డం మొద‌లెట్టారు. దానికి కార‌ణం.. పూజా హెగ్డే.

త‌న కాళ్ల‌తో.. అఖిల్ ని ఇరిటేట్ చేయ‌డానికో, ముగ్గులోకి దించ‌డానికో ప్ర‌య‌త్నిస్తున్న – రొమాంటిక్ లుక్ అది. ఈ పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చినప్ప‌టి నుంచీ.. పూజా కాళ్ల గురించీ, గ్లామ‌ర్ గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లైంది. అఖిల్ కి రావాల్సిన మైలేజీ మొత్తం.. పూజా ఖాతాలోకి చేరిపోయింది. నిజానికి.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ క‌థ‌ల్లో లేడీ డామినేష‌న్ ఎక్కువ‌. ‘బొమ్మ‌రిల్లు’ లో అది వ‌ర్క‌వుట్ అయ్యింది కూడా. ఈసారీ.. అలా వ‌ర్క‌వుట్ అయితే.. పేరు ఎవ‌రికి వెళ్లినా, అఖిల్ ఖాతాలో ఓ హిట్టు ప‌డుతుంది. ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు బ్రేక్ ఇచ్చిన‌ట్టు అవుతుంది. అఖిల్ కోరుకున్న‌ది కూడా అదే. అయితే అక్కినేని అభిమానులు మాత్రం `కొంప‌దీసి మా హీరో ఇమేజ్‌పై నెగిటీవ్ ప్ర‌భావం చూపించ‌దు క‌దా` అంటూ కొత్త అనుమానాల్ని, సందేహాల్నీ వ్య‌క్తం చేస్తున్నారు. పూజా డామినేష‌న్ ఈ పోస్ట‌రు వ‌ర‌కేనా? సినిమాలోనూ ఉంటుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close