‘బ్యాచిల‌ర్‌’ త‌ల‌రాత మార్చిన పూజా

టాలీవుడ్ అంటేనే సెంటిమెంట్ల మ‌యం. ఫ‌లానా హీరోయిన్ ఉంటే, సినిమా సూప‌ర్ హిట్ట‌ని న‌మ్మారంటే – ఆ హీరోయిన్ జాత‌కం మారిపోయిన‌ట్టే. తాను కూడా అలానే సినిమా `రాత‌`ని కూడా మార్చేస్తూ ఉంటే, త‌ను ల‌క్కీ గాళ్ అయిపోతుంది. ఆ ముద్ర పూజా హేగ్డేపై ఎప్పుడో ప‌డిపోయింది. పూజా చేసిన సినిమాల‌న్నీ దాదాపుగా హిట్టే. అందుకే త‌ను అదృష్ట క‌థానాయిక అయిపోయింది. ఆ అదృష్టం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`కీ ప‌ట్టేసింది.

అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను.. ఇలా సినిమాల‌పై సినిమాలు చేసినా – అఖిల్ కి ఒక్క బ్రేక్ కూడా రాలేదు. త‌న ఆశ‌ల‌న్నీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`పైనే పెట్టుకున్నాడు. ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన ఈసినిమాకి ఓ మోస్త‌రు రేటింగులు వ‌చ్చాయి. కాక‌పోతే.. వ‌సూళ్లు మాత్రం జోరుగానే ఉన్నాయి. ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన మూడు సినిమాల్లో.. బ్యాచిల‌ర్ దే అప్ప‌ర్ హ్యాండు. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మిగిలిన ఏరియాల్లోనూ త్వ‌ర‌లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సుంది. ఇదంతా పూజా హెగ్డే చ‌ల‌వే అన్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల మాట‌. ఈ సినిమాకి యువ‌త‌రం ప్రేక్ష‌కులే మ‌హారాజ పోష‌కులు. వాళ్లంతా పూజా కోస‌మే థియేట‌ర్ల‌కు వెళ్తున్నార‌ని టాక్‌. దాంతో పాటుగా పూజా క్యారెక్ట‌ర్ కూడా ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. పూజా హెగ్డే ది గోల్డెన్ లెగ్ కాబ‌ట్టే, వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ కి ఉప‌శ‌మ‌నం క‌లిగింద‌ని, మిక్డ్స్ రివ్యూలు వ‌చ్చినా – బ్యాచిల‌ర్ గ‌ట్టెక్క‌గ‌లిగాడ‌ని పూజా ఫ్యాన్స్ చెబుతున్నారు. అలాగైతే… ఈ గోల్డెన్ లెగ్ కి మ‌రింత డిమాండ్ పెరిగిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పరామర్శలతో బాధితులకు భరోసా వస్తుందా !?

సొంత జిల్లా ప్రజలు అతలాకుతలమైపోయినా సీఎం జగన్ పట్టించుకోలేని తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న తర్వాత రెండు రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి, కడపతో పాటు నెల్లూరు జిల్లాలోనూ పర్యటించారు....

ఆ గోరు ముద్దలు జగనన్నవి కావట !

జగనన్న గోరు ముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అంటూ .. అంగన్‌వాడీ పిల్లలకు ఇస్తున్న ఆహారానికి పబ్లిసిటీ చేసుకుంటున్న ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తక్షణం...

టికెట్ రేట్లు తగ్గించే ఆలోచన లేదు : మంత్రి తలసాని

తెలంగాణ ప్రభుత్వానికి సినిమా టికెట్‌ ధరలు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులతో...

ఏపీ ఉద్యోగ సంఘ నేతలను వ్యూహాత్మకంగా అవమానిస్తున్నారా !?

ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన కావాలనే ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘ నేతల్ని తీవ్రంగా అవమానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. పీఆర్సీ కోసం అదే పనిగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో...

HOT NEWS

[X] Close
[X] Close