ఇండ్ర‌స్ట్రీకి పెద్ద అవ‌స‌రం లేదు:  ద‌ర్శ‌కేంద్రుడి మాట‌

టాలీవుడ్ పెద్ద ఎవ‌రు?  
– ఇప్పుడు ఇదే బిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఆ స్థానం చిరంజీవిదే అని ఓ వ‌ర్గం అంటుంటే, మ‌రో వ‌ర్గం మాత్రం `దాసరి లేని లోటు భ‌ర్తీ చేయ‌లేరు` అంటోంది. ఇంకో వ‌ర్గం.. `మంచు ఫ్యామిలీనే` పెద్ద దిక్కు అని కొత్త పాట పాడుతోంది. దీనిపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌దైన శైలిలో స్పందించారు. `అస‌లు చిత్ర‌సీమ‌కు పెద్ద దిక్కే అవ‌స‌రం లేద‌`ని తేల్చేశారు.

”ఇక్క‌డ ఎవ‌రి మాట ఎవ‌రూ విన‌రు. అలాంట‌ప్పుడు స‌ల‌హాలు ఇవ్వ‌డం ఎందుకు?  చెప్పిన ప‌ని చేయ‌క‌పోతే బాధ ప‌డ‌డం ఎందుకు?  ఆ అవ‌స‌రం లేదు” అని చెప్పుకొచ్చారు రాఘ‌వేంద్ర‌రావు. ఇండ్ర‌స్ట్రీలో ఉన్న పెద్ద‌లంద‌రితోనూ ద‌ర్శ‌కేంద్రుడికి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న‌కు చిరంజీవి కావాలి.. మోహ‌న్ బాబూ కావాలి. అందుకే మ‌ధ్యేమార్గంగా ఈ త‌ర‌హా కామెంట్లు చేశారేమో..?

”నా జీవితంలో రెండే రెండు కోరిక‌లున్నాయి. ఒక‌టి అజాత శ‌త్రువు అనిపించుకోవాలి. రెండోది.. ఎవ‌రికీ స‌ల‌హాలు ఇవ్వ‌కూడ‌దు. ఇండ్ర‌స్ట్రీ నాకు చాలా గౌర‌వించింది. ఈత‌రం దర్శ‌కులు సైతం అభిమానిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల మ‌ధ్య పెద్ద‌రికం చూపించాల్సిన అవ‌సరం ఏమొచ్చింది” అంటూ… సున్నితంగా చెప్పి త‌ప్పించుకున్నారు రాఘ‌వేంద్ర‌రావు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close