స్థానిక ఎన్నికల బూస్ట్.. వైసీపీ ఖాతాలో 11 ఎమ్మెల్సీలు !

స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఆ పార్టీకి మరో రకంగా కలిసి వస్తోంది . స్థానిక సంస్థల కోటాలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ ఆ పార్టీ స్వీప్ చేయబోతోంది.  ప్రస్తుతం ఏపీలో  14 ఎమ్మెల్సీ స్థానాలు ఖళీగా ఉన్నాయి. ఇందులో మూడు మాత్రమే ఎమ్మెల్యే కోటా ఎన్నికలు.  మిగిలిన పదకొండు స్థానిక సంస్థల కోటాలోనివి. కరోనా కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

వచ్చే నెలలో నిర్వహించవచ్చన్న సంకేతాలు పంపింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కోర్టు పరిధిలో ఉన్నందున స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఇప్పుడు మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విపక్ష పార్టీలు పోటీ చేసే అవకాశం లేదు. దాదాపుగా 80 నుంచి 90 శాతానికిపైగా విజయాలు .. స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ ఖాతాలోనే ఉన్నారు.

అందుకే ఈ అన్ని స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయి. ఈ పధ్నాలుగు ఎమ్మెల్సీ సీట్లను ఎవరెవరికి ఇవ్వాలన్నదానిపై ఇప్పటికే వైసీపీ హైకమండ్ కసరత్తు పూర్తి చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలు పూర్తయితే మండలిలో వైసీపీకి పూర్తి మెజార్టీ వస్తుంది. అయితే మండలిని రద్దు చేయాలనే తీర్మానం కేంద్రం వద్ద ఉంది. ఆ తీర్మానం విషయం ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close