పాట పాడుతున్న పూజా హెగ్డే

హీరోలు, ద‌ర్శ‌కులు అప్పుడ‌ప్పుడూ గొంతు స‌వ‌రించుకోవ‌డం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్ల‌లోనూ సింగ‌ర్లు త‌యార‌వుతున్నారు. ఆ లిస్టులోకి పూజా హెగ్డే చేరిపోయింది. త‌న కొత్త సినిమాలో పూజా త‌న పాట తానే పాడుకోనుంది. అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పూజానే క‌థానాయిక‌. ఈ సినిమా కోసం పూజ తొలిసారి గాయ‌ని అవ‌తారం ఎత్త‌బోతోంది. అందుకోసం త‌మ‌న్ ఓ మంచి ట్యూన్ సిద్ధం చేశాడ‌ని స‌మాచారం.

“నాకు చిన్న‌ప్ప‌టి నుంచీ సంగీతం అంటే ఇష్టం. ఖాళీ స‌మ‌యాల్లో పాట‌లు పాడుకుంటుంటా. అయితే ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్ని మాత్రం కాను. కాక‌పోతే సినిమాల్లో పాడాల‌ని ఆశ‌గా ఉంది“ అని ఇది వ‌ర‌కే పూజా ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది. ఆ అవ‌కాశం త్రివిక్ర‌మ్ సినిమా ద్వారా దొరికేసింది. ఇక మీద‌ట పూజా సినిమాల్లో పాట‌ల కోసం గాయ‌నీమ‌ణుల్ని వెదుక్కునే అవ‌స‌రం త‌ప్పిన‌ట్టుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close