త్రివిక్రమ్ శ్రీనివాస్, పూనమ్ కౌర్ ఇష్యూ ఇప్పటిది కాదు. ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారని, అతని మాయ మాటలు విని మోసపోయానని.. ఇలా అనేక సందర్భాల్లో పూనమ్ పెద్ద ఎత్తునే ఆరోపణలు చేసింది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
”నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కంప్లైంట్ చేశాను. రాజకీయ అండదండలతో ఎవరైతే తప్పించుకుంటున్నారో అతడి మీద ఫిర్యాదు చేశాను. మెయిల్ చేసినట్టుగానే ఉమెన్ టీంతో నేను మాట్లాడతాను’అని తాజాగా పూనమ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
అంతేకాదు.. తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఝాన్సీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను కూడా పూనమ్ రివిల్ చేసింది. ఈ క్రమంలో మరోసారి వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఆమె చేసిన ఆరోపణల్లో తివిక్రమ్ పేరుని పరోక్షంగా ప్రస్థావించేది. కానీ ఈసారి నేరుగా ఆయన పేరుని తన పోస్ట్ లో ప్రకటించింది. అలాగే ఇప్పుడు ఈ వివాదంలో ఝాన్సీ కూడా ఇన్వాల్ అయ్యారనేది ఆమె పోస్ట్ ద్వారా తెలుస్తోంది. గతంలో పూమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచి ఓ రెండు రోజుల్లో సద్దుమణిగేది. అయితే ఈసారి పూనమ్ గట్టిగానే నిలబడలా కనిపిస్తుంది. ఇలాంటి లైంగిక ఆరోపణల్లో నిజాల్ని నిగ్గు తేల్చడానికి తెలుగు చిత్రసీమ ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జానీ మాస్టర్ ఉదంతాన్ని కూడా ఇదే కమిటీ విచారణ చేసింది. అప్పట్లోనే పూనమ్ ఇష్యూ పై చర్చ నడిచింది. పూనమ్ తమని సంప్రదిస్తే, తగిన ఆధారాలు చూపిస్తే తప్పకుండా యాక్షన్ తీసుకొంటామని కమిటీ ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు పూనమ్ నేరుగానే బాణం సంధించింది. ఈసారి ఈ వ్యవహారం కాస్త ముందుకు కదిలేలానే కనిపిస్తోంది. పూనమ్ బాధ వినడానికి, ఆమె ఆరోపణల్లో బలం ఉందా, లేదా? అనేది తేల్చడానికి ఇప్పుడు అభయహస్తం దొరికింది. ఇప్పుడు కూడా పూనమ్ ముందుకు రాకపోతే, ఇక ముందు ఆమె ఎలాంటి ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోరు. మరి పూనమ్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి.