ఈ పోర్న్.. ఆపతరమా ?

పెద్దోళ్ల పోర్న్ వెబ్ సైట్స్ పై నియంత్రణ సాధ్యంకాదని కేంద్రం చేతులెత్తేసింది. పైగా ఇంటర్నెట్ ఇంతభారీ స్థాయిలో స్ప్రెడ్అయ్యాక ప్రతిఒక్కరిపై నిఘాపెట్టడం సాధ్యంకాదని తేల్చిపారేసింది. మరి అలాంటప్పుడు పోర్న్ వెబ్ సైట్స్ పై నియంత్రణఅన్నది నీటిమూటేనని తేలిపోయింది. కఠిన చట్టం తీసుకురావడం సాధ్యంకాదా?
అశ్లీల వెబ్ సైట్ల వల్ల పిల్లలు చెడిపోతారన్న భయాందోళన ప్రతితల్లిదండ్రుల్లో కనిపించడాన్ని ఎవ్వరూ తప్పుబట్టలేరు. కానీ పోర్న్ వెబ్ సైట్ల నియంత్రణ పూర్తిగా సాధ్యమవుతుందా అన్నదే ప్రస్తుత ప్రశ్న.
ఒక పక్క ప్రధానమంత్రి మోదీ పల్లెపల్లెలకూ ఇంటర్నెట్ సౌకర్యం రావాలని కోరుకుంటుంటే, డిజిటల్ ఇండియా తీసుకురావాలని తపిస్తుంటే, మరో పక్క ఇంటర్నెట్ ద్వారా అశ్లీల భూతంలా విరుచకుపడుతూ, రేపటిపౌరుల శక్తిని నిర్వీర్యంచేసే ప్రమాదం పొంచిఉంది.
పౌరులకు పాలకులు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారన్నది ఆలోచించాలి. ఈమధ్య 857 పోర్న్ వెబ్ సైట్స్ పై నిషేధం అమలుచేసినతర్వాత ఇంటర్నెట్ లో అశ్లీలత అన్న అంశంపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఫలానా వెబ్ సైట్ చూస్తే పిల్లలు చెడిపోతారనుకున్నవాటిని బ్యాన్ చేయడం ఒకఎత్తైతే, మొత్తం పోర్న్ సైట్స్ ని నిషేధించడం మరో ఎత్తు. అయితే, ఇందులో మొదటిది సాధ్యమే అయినా రెండోది కష్టమని కేంద్రం చేతులెత్తేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నాయకత్వంలోని ధర్మాసనం ఎదుట అటార్నీ జనరల్ ముఖులు రోహత్గీ వివరణ ఇస్తూ, ప్రభుత్వం పిల్లలకు హానికలిగించేవి భావించే అశ్లీల వెబ్ సైట్లపై చర్యలు తీసుకోగలదేకానీ, పెద్దల పోర్నగ్రాఫీ సైట్స్ మీద చర్యలు తీసుకోలేదని తేల్చిచెప్పారు.
పోర్న్ సైట్స్ అంశం నైతిక విలువలకు సంబంధించిందే. పెద్దలను దారికితీసుకురావడం తమకు సాధ్యంకాదన్న ధోరణిలో కేంద్రప్రభుత్వం ఉంది. దేశమంతటా ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రైవేట్ , పోర్న్ సైట్లు చూస్తున్నారా, లేదా అని తెలుసుకోవడం అయ్యేపనికాదన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఎదుట ప్రభుత్వం వ్యక్తంచేసింది. మోరల్ పోలీసింగ్ చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం చేతులెత్తేసింది. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సినపరిస్థితి తలెత్తింది. పోర్నోగ్రఫీకీ, చైల్డ్ పోర్నోగ్రఫీకి ఉన్న నిర్వచనాలేమిటో చెప్పాలని మనదేశంలోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ కోరుతోంది. ఈ విషయంలో తమకు క్లారిటీ ఇవ్వాలని కోరుతూ ఈ సంఘం త్వరలోనే కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖను కలవబోతోంది.
ఇండోర్ లోని న్యాయవాది కమలేష్ వాస్వణి సుప్రీంకోర్టులో దాఖలుచేసిన ప్రజాప్రయోజనవాజ్యంపై ధర్మాసనం విచారణచేపట్టింది. అశ్లీల వెట్ సైట్ల పూర్తిస్థాయి నియంత్రణలో ప్రభుత్వం విఫలైమన నేపథ్యంలో పటిష్టమైన చట్టం తీసుకురావాలని దరఖాస్తుదారుడు సర్వోన్నతన్యాయస్థానాన్ని కోరారు. కాగా, టెలికమ్యూనికేషన్స్ శాఖ సమాచారసాంకేతిక చట్టం 2000 క్రింద ఈమధ్య ఒక ఉత్తర్వులో 857 వెబ్ సైట్ లను బ్యాన్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ తరహా ఉత్తర్వులు చర్చనీయాంశమవడంతో టెలికామ్ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై సమీక్షించుకోవాల్సివచ్చింది.
మొత్తానికి ఒక విషయం తేలిపోయింది. అదేమంటే, అంతర్జాలంలో పోర్న్ నిషేధమన్నది కేవలం నైతిక చైతన్యంతోనే సాధ్యమవుతుంది. అంతర్జాలంలో సెక్స్ సైట్స్ తెస్తున్నచెరుపు అందరికీ తెలిసిందే అయినప్పటికీ, దానిపై నియంత్రణ బలవంతంగా రుద్దలేమనే అనిపిస్తోంది. మనిషికీ, మృగానికీ మధ్య ఉన్న సన్నటి రేఖను పోర్న్ వెబ్ సైట్స్ తుడిచివేస్తున్నాయి. దీంతో లేతవయుసులోనివారు సెక్స్ పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. పోర్న్ సమస్య ఉగ్రవాద, తీవ్రవాద సమస్యల్లాంటిదేననీ, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని సామాజికవేత్తలు భావిస్తున్నారు. మనిషి మత్తుమందుకు బానిసఅయితే ఎంతటి విపత్కర సమస్యలు తలెత్తుతాయో, పోర్న్ వెబ్ సైట్లకు అలవాటైన వ్యక్తి అంతటి సమస్యలు తీసుకురాగలడని మానసికవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే పోర్న్ వెబ్ సైట్లను బ్యాన్ చేయాల్సిందే. కానీ, అది పూర్తిస్థాయిలో సాధ్యంకాదని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి తేల్చిచెప్పడంతో ఇప్పట్లో కఠినమైన చట్టాలు రూపుదిద్దుకునే పరిస్థితులు లేవని అర్థమవుతుంది. మరి ఇది చివరకు ఎటుదారితీస్తుందో వేచిచూడాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెకే బాధ్యతలు

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత, విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అతిశీకి సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. కేజ్రీవాల్...

జానీ మాస్ట‌ర్ కేసు: ఛాంబ‌ర్ ఏం చేస్తోంది?

జానీ మాస్ట‌ర్ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అవ్వ‌డంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. హేమ క‌మిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి విష‌యాల్ని సీరియ‌స్ గా తీసుకొని,...

నెల్లూరులోనూ పెరుగుతున్న గేటెడ్ విల్లాల సంస్కృతి

ప్రజలు రాను రాను జీవన విధానంలో మార్పులు కోరుకుంటున్నారు. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇళ్ల చుట్టూ రణగొణ ధ్వనులు.. ఇతర...

హైడ్రా ఆగ‌దు… సీఎం రేవంత్ రెడ్డి పున‌రుద్ఘాట‌న‌!

హైడ్రా ఆగ‌దు... సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిసారి చెప్తున్న మాటే. అయితే, చెరువుల్లో, బ‌ఫ‌ర్ జోన్ల‌లో ఇప్ప‌టికే నివాసం ఉంటున్న సామాన్యుల జోలికి వెళ్ల‌ము అని హైడ్రా ప్ర‌క‌టించాక‌, దూకుడు త‌గ్గిన‌ట్లేన‌న్న అభిప్రాయం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close