కలకలం సృష్టిస్తోన్న లగడపాటి అనుకూల, వ్యతిరేక ఫ్లెక్సీలు

హైదరాబాద్: విజయవాడ నగరంలో ఇవాళ ఎక్కడ చూసినా లగడపాటి ఫ్లెక్సీలపైనే చర్చ. ఇవాళ లగడపాటి జన్మదినం సందర్భంగా నిన్న ఆయన అభిమానులు కొందరు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు. రాజగోపాల్ సన్నిహితుల పేరున వెలసిన ఆ ఫ్లెక్సీలలో బీజేపీ నేతల ఫోటోలతో పాటు కొన్నిచోట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. దీనితో ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా లగడపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద ఫ్లెక్సీలు పెట్టారు. అయితే దానిలో విషయం మాత్రం పూర్తిగా లగడపాటికి చురకలు అంటించేవిధంగా వ్యంగ్యంగా ఉంది. “75 వేల కోట్ల రూపాయలను బ్యాంకులనుంచి రుణాలుగా తీసుకుని బ్యాంకులను ముంచి కుటుంబం పేరుమీద విదేశాలలో అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్న లగడపాటి రాజగోపాల్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా మరెన్నో వేల కోట్ల రూపాయలను కూడబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అభిమానులు” అని రాసి ఉంది. మధ్యలో ‘చాలవు-ఇంకా కావాలి’ అనే క్యాప్షన్ కూడా రాసి ఉంది. ఈ ఫ్లెక్సీలను చూసిన లగడపాటి అభిమానులు ఆందోళనకు దిగారు… తమ నేతకు వ్యతిరేకంగా ఉన్న ఆ ఫ్లెక్సీలను చించేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close