ప్రపంచంలో అత్యంత ధనిక ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న చైనా, రష్యా, భారత్ కలిస్తే.. అమెరికా ప్రపంచ వాణిజ్యంలోనే కాదు.. పవర్ దేశాల జాబితాలో కూడా ఎక్కడికో పడిపోతుంది. అమెరికా కేవలం సేవల రంగంలో..టెక్నాలజీ రంగం ఆధారిత ఆర్థిక వ్యవస్థ మీద నడుస్తోంది. తయారీ రంగం అంతా చైనాతో పాటు ఇతర దేశాలకు విస్తరించింది. అమెరికా అవసరాల్లో అత్యధికం దిగుమతి అవుతూ ఉంటాయి. ఆపిల్ కంపెనీ అమెరికాదే కావొచ్చు కానీ.. ఆపిల్ ఫోన్లు అమెరికాలో తయారు కావు. అన్నీ అంతే.
ఇలాంటి ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న ట్రంప్ ఇప్పుడు మిత్ర దేశాలను దూరం చేసుకుని .. ఇప్పటి వరకూ దూరదూరంగా ఉండే దేశాల మధ్య కొత్త స్నేహానికి కారణం అవుతున్నారు. చైనా విషయంలో ఇప్పటి వరకూ భారత్ కాస్త దూరదూరంగానే ఉంటోంది. కానీ ఇప్పుడు మాత్రం చైనాతో సంబంధాలు పెంచుకునేందుకు సిద్ధమయింది. ప్రధాని మోదీ చైనాకు వెళ్తున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వస్తున్నారు. మూడు దేశాల మధ్య పరస్పర వాణిజ్య సహకారం మరింత పెరిగే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అమెరికాతో కాకుడా.. ట్రంప్ తో డీల్ చేస్తున్నట్లుగా విదేశాంగ విధానం నడుపుతున్నారు. ఆయన చర్యలు అమెరికాను ప్రపంచ పెద్దన్న పాత్ర నుంచి కిందుక దింపేశాయి. బ్రెజిల్ లాంటి దేశాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. భారత్ ఎదురుదాడి చేయకపోయినా.. డోంట్ కేర్ సంకేతాలు పంపింది. ప్రపంచ మార్కెట్ ను.. భారత్, చైనా, రష్యా గుప్పిట పెట్టుకున్న తర్వాత అమెరికాకు కావాల్సిన వస్తువుల విషయంలో , దిగుమతుల విషయంలో.. మెల్లగా కఠినంగా వ్యవహరిస్తే.. అమెరికా పరిస్థితి ఘోరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని ట్రంప్ ఊహించడం లేదు.