పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనన్న కేఆర్ఎంబీ..!

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో.. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తి పోసుకునే ప్రాజెక్ట్‌కు.. రూపకల్పన చేసిన ప్రభుత్వం.. దానికి అభ్యంతరాలు రాకుండా.. చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయింది. చివరికి కృష్ణా బోర్డును కూడా ప్రభుత్వం మేనేజ్ చేయలేకపోయింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనని తాజాగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినివ్వడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టడం రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 84, 11వ షెడ్యూల్‌లో 7వ పేరాను ఉల్లఘిస్తుందని కేఆర్ఎబీ చెబుతోంది.

ఏపీ నీటిని ఏపీ అవసరాలకు వాడుకుంటామని.. ఎవరి అనుమతులు అక్కర్లేదని.. ఏపీ సర్కార్ వాదిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. సాధారణంగా ఇలాంటి వాటిని వీలైనంత గోప్యంగా ఉంచి.. నిధులు కేటాయించి.. పనులు చేయించుకుంటారు. ఎగువ రాష్ట్రాలే ఆ పనులు చేస్తూంటాయి. అయితే.. దిగువ రాష్ట్రమైన ఏపీ ఈ విషయంలో లేనిపోని ప్రచారానికి పోవడంతో.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో రాజకీయ అంశమైంది. ఫలితంగా.. రెండు రాష్ట్రాల్లోనూ… మళ్లీ జల వివాదాలు వచ్చాయన్న అభిప్రాయం ఏర్పడింది. రెండు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదులు… మామూలుగానే ఉండటంతో.. వివాదం.. అపెక్స్ కౌన్సిల్ వద్దకు వెళ్లింది.

రాయలసీమ ఎత్తిపోతల అక్రమమేనని.. కేఆర్ఎంబీ నేరుగా.. ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిపింది. బీజేపీకి చెందిన నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి.. పీఎంవోకు గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పీఎంవో… కేఆర్ఎంబీకి పంపింది. దానికి స్పందనగా.. కృష్ణా రివర్ బోర్డు… ప్రాజెక్ట్ పరిస్థితిని పీఎంవోకు తెలియచేసింది. ఇదే స్పష్టమైన అభిప్రాయం ఉండటంతో… రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడం ఇక కష్టమన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం.. కట్టి తీరాలన్న లక్ష్యంతో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“జై అమరావతి” అంటే బీజేపీలో సస్పెన్షనే..!

అమరావతి రైతుల కోసం పోరాడతామని భారతీయ జనతా పార్టీ ఓ వైపు చెబుతోంది. ఆ రైతులకు మద్దతు చెప్పేందుకు వెళ్లిన నేతలపై మాత్రం సస్పెన్షన్ల వేటు వేస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా ఓ...

మోడీకి జగన్ అభినందనలు..!

నిజమే.. మీరు కరెక్ట్‌గానే చదివారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ అభినందనలు తెలిపారు. మోడీ ఆ అభినందులు రిసీవ్ చేసుకుని .. జగన్ అభినందించినందుకు పొంగిపోయారో లేదో తెలియదు కానీ.. మోడీని జగన్ అభినందించిన...

క్రైమ్ : ఒకరిది ఆత్మహత్య…మరొకరిది హత్య..! ఇద్దరు తండ్రుల కథ..!

వారిద్దరూ ఆడపిల్లల తల్లిదండ్రులు. కని పెంచి.. అల్లారుముద్దుగా పెంచి.. తమకు చేతనయినంతలో మంచోళ్లు అనుకునే వాళ్లకే కట్టబెట్టారు. కానీ వారు అనుకున్నంత మంచోళ్లు కాదు. ఆ విషయం తెలిసి తమ కూతుళ్లు జీవితాలు...

ఐవైఆర్ కూడా అమరావతినే ఉంచమంటున్నారు..!

వారం రోజులు ఆలస్యంగా తన పెన్షన్ వచ్చిందని... మూడు రోజులుగా ఐవైఆర్ కృష్ణారావు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆయన రోజువారీగా... ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి జగన్‌కు సలహాలిస్తూ ట్వీట్లు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close