22న ఏపీలో ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణం..!

రాజ్యసభకు ఎన్నికయిన పిల్లి, మోపిదేవి స్థానాల్లో ఇద్దరు కొత్త మంత్రులను.. ఏపీ కేబినెట్‌లోకి ఇరవై రెండో తేదీన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పెద్దలు ముహుర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కరోనా కారణంగానో.. మరో ఇబ్బంది కారణంగానో.. ఆ రోజు సాధ్యం కాకపోతే. .24న పూర్తి చేయాలనుకుంటున్నారు. అయితే ఎవరెవరికి పదవులు లభిస్తాయన్నదానిపై మాత్రం..వైసీపీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ ఓ నాలుగు పేర్లను మాత్రం.. మీడియాలో చర్చకు పెట్టింది. పొన్నాడ సతీష్, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పిల్లి సుభాష్ చంద్రబోస్ తూ.గో జిల్లా నుంచి.. మోపిదేవి గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే జిల్లాల నుంచి.. ఇతరులకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాని అంశంగా హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. గుంటూరు జిల్లాకు ఓ మంత్రి పదవి కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది మోపిదేవి ప్లేస్‌లో… అదే వర్గానికి చెందిన తూ.గో జిల్లాకు చెందిన నేత పొన్నాడ సతీష్ పేరు దాదాపుగా ఫైనల్ అయింది. ఇక పిల్లి సుబాష్ స్థానంలో… కృష్ణా జిల్లా లేదా.. ఉత్తరాంధ్ర నుంచి మంత్రి రావొచ్చని అంటున్నారు. ఈ రకంగా చూస్తే.. జిల్లాల్లో మంత్రుల సమీకరణాలు మారతాయి. అయినప్పటికీ.. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా.. రెండు మంత్రిపదవులతోనే భర్తీ చేయాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆశ్చర్యకరంగా ఓ ఎమ్మెల్సీకి కూడా మంత్రి పదవి ఇవ్వబోతున్నారని జోరుగాప్రచారం జరిగింది కానీ… అలాంటి అవకాశం లేదని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. శాసనమండలిని రద్దు చేస్తామని.. చెప్పి.. ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపిన తర్వాత.. మరో ఎమ్మెల్సీని మంత్రిని చేస్తే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం.. వైసీపీ హైకమాండ్‌పై ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. రెండు పదవుల భర్తీ కాకుండా.. ఇతర అంశాలపై దృష్టి పెడితే.. మొత్తం గందరగోళం అవుతుందని ఆగిపోయినట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close