ఆర్కే పలుకు : పోతిరెడ్డిపాడు డైవర్షన్ రాజకీయమే..!

ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో పోతిరెడ్డిపాడు వివాదంపై తనదైన విశ్లేషణ చేశారు. రాజకీయ నాయకులు ఓ సమస్యను మరుగుపర్చడానికి మరో సమస్యను తెరపైకి తెస్తారని..ఆ వ్యూహంలో భాగంగా… ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటనను నుంచి దృష్టి మళ్లించడానికే… పోతిరెడ్డిపాడు జీవోను ఏపీ సర్కార్ విడుదల చేసిందని.. ఆయన విశ్లేషించారు. ఇదంతా జగన్‌కు మిత్రునిగా ఉన్న కేసీఆర్ కు తెలియకుండా జరిగి ఉండదనేది.. ఆయన కథనంలోని సారాంశం. అంతే కాదు.. అసలు ఇప్పటికిప్పుడు పోతిరెడ్డిపాడును విస్తరించినా.. రాయలసీమకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని లెక్కలతో వివరించారు. కాలువలు పెద్దవి చేసి… ఎత్తిపోసుకున్నా… రాయలసీమలో నిల్వ చేసుకునే రిజర్వాయర్ల సామర్థ్యం లేదని ఆయన చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును రాజకీయంగా ఉపయోగించుకుంటోందని అనడానికి మరికొన్ని ఉదాహరణను ఆర్కే వెల్లడించారు. రాయలసీమకు నిజంగా నీళ్లు ఇవ్వాలి అనుకుంటే.. చడీచప్పుడు కాకుండా ఎత్తిపోతలను పూర్తి చేయాల్సిందన్నారు. ముచ్చుముర్రిని చంద్రబాబు ఎలా పూర్తి చేశారో తెలియదా అని ప్రశ్నించారు. అంతే కాకుండా…వివాదాస్పద జీవోను అలా బహిరంగంగా విడుదల చేయడానికి కారణం ఏమిటని కూడా ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. తమకు అవసరమైన జీవోలు సీక్రెట్‌గా విడుదల చేస్తున్నారుకదా.. అని ప్రశ్నిస్తున్నారు. కరువు- కాటకాలతో అల్లాడిపోతున్న రాయలసీమ ప్రజల్లో భావోద్వేగాలు పెంపొందించి రాజకీయ ప్రయోజనం పొందడం ఆ ప్రాంత నాయకులకు అలవాటుగా మారిపోయిందని ఆర్కే తేల్చేశారు.

కరెంట్ చార్జీల పెంపుపై కూడా ఆర్కే జగన్ తీరును సునిశితంగా విమర్శించారు. ప్రమాణస్వీకారం సమయంలో అన్నింటినీ తగ్గించేస్తానని జగన్ ప్రకటనను గుర్తు చేశారు. ఏడాది కాకుండానే మోయలేనంతగా భారం మోపారని ఆర్కే ఆక్షేపించారు. మద్యం విషయంలో జగన్ సర్కార్ వాదనను హైలెట్ చేస్తూ.. వినియోగాన్ని తగ్గించడానికే రేట్లు పెంచుతున్నారనే వాదనను… ఇక వినిపిస్తారని.. సెటైర్లు వేశారు. గత వారం… జగ్మోహన్ రెడ్డికి కాస్త అనుకూలంగా ఆర్టికల్ రాశారు. ఆయన రాజకీయ వ్యహాలతో ఓటు బ్యాంక్‌ను సుస్థిరం చేసుకుంటున్నాని రాశారు. దీంతో ఆర్కే ఎందుకు అలా మారారన్నప్రశ్నలు వచ్చాయి. దానికి కూడా.. ఆయన తన కథనంలో వివరణ ఇచ్చారు. తాను రాసిన దాంట్లో అర్థం స్పష్టంగా ఉందని.. అర్థం చేసుకున్న వారు చేసుకున్నారు.. లేని వారు లేదని చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close