మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌తానంటోంది!

సినిమా వాళ్ల‌కు ప్రేమ‌లో ప‌డ‌డం – విడిపోవ‌డం – మ‌రొక‌రితో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌డం మ‌హా మామూలు. బ్రేక‌ప్ అంటే… వాళ్ల‌కు మేక‌ప్ వేసుకున్నంత ఈజీ. చాలామంది జీవితాలు అందుకు సాక్ష్యంగా క‌నిపిస్తుంటాయి. శ్రుతి హాస‌న్ కూడా అందుకు మిన‌హాయింపు కాద‌న్న‌ట్టు మాట్లాడుతోంది. మైఖెల్ క్రోస‌లే తో కొన్నాళ్లు ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపింది శ్రుతి. ఇద్ద‌రూ క‌లిసిన ఫొటోల్ని శ్రుతి చాలాసార్లు త‌న అభిమానుల‌తో పంచుకుంది. వాళ్ల ప్రేమ క‌బుర్లు చెప్పుకుంది. అయితే ఏమైందో.. ఇద్ద‌రూ విడిపోయారు.

ఓసారి ప్రేమ‌లో విఫ‌లం అయినంత మాత్రాన మ‌ళ్లీ ప్రేమించ‌కూడ‌ద‌ని ఉందేంటి? అందుకే… తాను మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌డానికి సిద్ధ‌మే అంటోంది శ్రుతి. ”నేను ప్రేమ‌లో ప‌డే వ‌య‌సులోనే ఉన్నాను. ఈ వ‌య‌సులో కాక‌పోతే ఏ వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డ‌తాం? నేను ఎదురు చూసే గొప్ప ప్రేమ దొరికిన‌ప్పుడు త‌ప్ప‌కుండా మ‌ళ్లీ ప్రేమిస్తా” అంటోంది, మైఖెల్ తో ప్రేమ బెడ‌సి కొట్ట‌డం ఓ ‘లెర్నింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌’ అంటోంది. ప్రేమ‌లో ప‌డినందుకు, అది విఫ‌లం అయినందుకు తానెప్పుడూ ప‌శ్చాత్తాప ప‌డ‌లేద‌ని, అదో గ‌మ్మ‌త్తైన అనుభ‌వం అని చెప్పుకొచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజధాని తరలింపుపై కొత్త కదలికలు నిజమేనా..!?

రాజధాని తరలింపు బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టడంపై.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకు ముందు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ ఆలస్యం అవుతూండటంతో.. సుప్రీంను ఆశ్రయించారు....

కాపు నేస్తం పథకం దుర్వినియోగం

కాపులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చానంటూ.. కాపు నేస్తం అనే పథకాన్ని పెట్టిన ఏపీ సర్కార్.. ఆ పథకం పేరుతో రెడ్డి సామాజికవర్గానికి సాయం చేశారన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. దానికి...

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనన్న కేఆర్ఎంబీ..!

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో.. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తి పోసుకునే ప్రాజెక్ట్‌కు.. రూపకల్పన చేసిన ప్రభుత్వం.. దానికి అభ్యంతరాలు రాకుండా.. చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయింది. చివరికి కృష్ణా బోర్డును...

22న ఏపీలో ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణం..!

రాజ్యసభకు ఎన్నికయిన పిల్లి, మోపిదేవి స్థానాల్లో ఇద్దరు కొత్త మంత్రులను.. ఏపీ కేబినెట్‌లోకి ఇరవై రెండో తేదీన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పెద్దలు ముహుర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close