ట్రైల్ షూట్ లో బిగ్ బీ..ప్ర‌భాస్‌!

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు… రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభ‌మైంది. బిగ్ బి, ప్ర‌భాస్ తో పాటు కీల‌క‌మైన తారాగ‌ణం అంతా ప్ర‌స్తుతం ఫిల్మ్‌సిటీలో ఉంది. ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌ల‌కు గెట‌ప్ ల టెస్ట్ చేస్తున్నార‌ని, ట్రైల్ షూట్ నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్పుడు తీసిందంతా సినిమాల్లో ఉండ‌దు. కేవ‌లం ఇది ట్రైల్ షూట్ మాత్ర‌మే. అయితే ఈ షాట్స్ ని ప్ర‌చార చిత్రాల్లో ఉప‌యోగించుకోవాల‌నుకుంటున్నారు. ఇదో విచిత్ర‌మైన జోన‌ర్ కి చెందిన క‌థ అని, సోషియో ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్ రెండూ మిళిత‌మై సాగుతాయ‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు ఈ స్క్రిప్టు రాసుకోవ‌డంలో నాగ అశ్విన్ కి స‌హాయ ప‌డ్డారు. దీపికా ప‌దుకొణే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని 2023లో విడుద‌ల చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: మూడు ముక్క‌లాట‌

ద‌స‌రా సంద‌ర్భంగా టాలీవుడ్ కొత్త సినిమాలతో క‌ళ‌క‌ళ‌లాడింది. మ‌హాస‌ముద్రం ఫ్లాప్ అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఓకే అనిపించుకుంది. పెళ్లి సంద‌డి బోర్ కొట్టించినా, కొన్ని ఏరియాల్లో అనూహ్య‌మైన వ‌సూళ్ల‌ని రాబ‌ట్టుకుంది. ఈ...

నెటిజన్స్ డిమాండ్: ఇతరుల తల్లులను తిట్టిన నేతలపై కూడా జగన్ చర్యలు తీసుకోవాలి

తాజాగా పట్టాభి వ్యాఖ్యల కారణం గా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న జగడం ప్రజల కి వి‌స్మయం కలిగిస్తోంది. పోలీసుల సంస్మరణ దినం సందర్భం గా ముఖ్య మంత్రి జగన్ కూడా ఇదే...

ద‌ర్శ‌కుల‌కూ బాకీ ప‌డ్డాడా?

ఇటీవ‌ల యువ నిర్మాత మ‌హేష్ కోనేరు గుండె పోటుతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ మృతితో.. టాలీవుడ్ షాక్ కి గురైంది. ఓర‌కంగా... చాలామంది గుండెలు కూడా ఉలిక్కిప‌డిన‌ట్టైంది. సాధార‌ణంగా...

మోహన్‌బాబును అరెస్ట్ చేయాలని పదుల సంఖ్యలో ఫిర్యాదులు !

మంచు మోహన్ బాబుపై పలికిన ఓ డైలాగ్ వివాదాస్పదమయింది. ఆయనపై రెండు తెలుగు రాష్ట్రాల సంఖ్యలో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. మొదట అనంతపురం జిల్లాలో ఓ యాదవ సంఘం నేత పోలీసులకు...

HOT NEWS

[X] Close
[X] Close