ప్ర‌భాస్ – మారుతి.. ద‌స‌రాకే!

మారుతి క‌థ‌కు ప్ర‌భాస్ ఓకే చెప్ప‌డం, మారుతి స్క్రిప్టు ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైపోయి ఉండ‌డం తెలిసిన విష‌యాలే. ఈ చిత్రానికి డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌. ఏప్రిల్ లో సినిమా ప్రారంభం అవుతుంద‌నుకున్నారు. ఆ త‌ర‌వాత మే.. అన్నారు. ఇప్పుడు ఈ సినిమా ముహూర్తం ద‌స‌రాకి షిఫ్ట్ అయిపోయింది. ద‌స‌రాకి ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. ఆ వెంట‌నే సెట్స్‌పైకి వెళ్లిపోతారు. ప్ర‌భాస్ – మారుతితో చేయ‌డానికి ఉత్సాహంగా ఉన్నా, ఇప్పుడు కాల్షీట్లు స‌ర్దుబాటు చేసే ప‌రిస్థితిలో లేడు. ప్ర‌భాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. స‌లార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్‌.. వీట‌న్నింటికీ స‌మానంగా డేట్లు ఇచ్చుకుంటూ వెళ్లాలి. అయితే ప్ర‌భాస్ ఇప్పుడు `స‌లార్‌`ని యుద్ధ ప్రాతిప‌దిక‌పై పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడు. మిగిలిన సినిమాల్ని ప‌క్క‌న పెట్టి ముందు `స‌లార్‌` సంగ‌తి తేల్చేద్దామ‌ని ఫిక్స‌య్యాడు. `కేజీఎఫ్ 2` సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిపోవ‌డమే అందుకు కార‌ణం. ఫామ్ లో ఉన్న ద‌ర్శ‌కుడ్ని వెయిటింగ్‌లో పెట్ట‌కూడ‌ద‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడు. పైగా `రాధే శ్యామ్‌`తో ప్ర‌భాస్ అభిమానులు పూర్తిగా నిరాశ‌కు లోనైపోయారు. వాళ్ల‌లో ఉత్సాహం తీసుకురావాలంటే `స‌లార్‌` లాంటి మాస్ ప్రాజెక్టే క‌రెక్ట్. అందుకే `స‌లార్‌`ని పూర్తి చేసి, వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌న్న‌ది ప్ర‌భాస్ ప్లాన్‌. `స‌లార్‌` పూర్త‌యిన వెంట‌నే మారుతి సినిమానీ `ప్రాజెక్ట్ కె` చిత్రాల‌కు డేట్లు కేటాయిస్తాడు. మారుతి ఎలాగూ సూప‌ర్ ఫాస్ట్ వేగంతో సినిమాని పూర్తి చేస్తాడు. ఈలోగా.. స్ర్కిప్టుని అన్ని ర‌కాలుగా సిద్ధం చేసుకొనే వీలు కూడా దొరుకుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close