పూజా ఐటెమ్ గాళ్ కాదు… హీరోయినే!

విజ‌య్ దేవ‌ర‌కొండ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో `లైగ‌ర్‌` వ‌ర్క్ జ‌రుగుతోంది. అది పూర్తి కాకుండానే `జ‌న‌గ‌ణ‌మ‌న‌` ప్ర‌క‌టించేశాడు. కొంత‌మేర షూటింగ్ కూడా జ‌రిగింది. ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా ఉంద‌ని టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో పూజా హీరోయిన్ కాద‌ని, ఐటెమ్ సాంగ్ కే ప‌రిమితం అవుతుంద‌ని వార్త‌లొస్తున్నాయి. అయితే.. ఇందులో ఏమాత్రం నిజం లేద‌ని… పూజా పీఆర్ టీమ్ స్ప‌ష్టం చేసింది. “జ‌న‌గ‌ణ‌మ‌న‌లో.. పూజా హెగ్డే హీరోయిన్‌. ఇందులో మ‌రో మాట లేదు. ఆమె ఐటెమ్ సాంగ్ చేయ‌డం లేదు. పూర్తి స్థాయి పాత్రోనే క‌నిపించ‌బోతున్నారు. జూన్ రెండో వారంలో ముంబైలో `జ‌న‌గ‌ణ‌మ‌న‌` షూటింగ్ మొద‌లు కానుంది. ఇందులో పూజా పాల్గొంటారు. విజ‌య్ దేవ‌ర‌కొండ – పూజా హెగ్డేల‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు“ అని పూజా స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఇటీవ‌ల ఎఫ్ 3లో ఓ ప్ర‌త్యేక గీతంలో నర్తించింది పూజా. ఆ పాట‌కు థియేట‌ర్లో మంచి స్పంద‌న వ‌స్తోంది. బీస్ట్‌, ఆచార్య సినిమాలు నిరాశ ప‌రిచినా.. ఎఫ్ 3 విజ‌య‌వంతం అవ్వ‌డంతో.. పూజా ఇప్పుడు రిలీఫ్ ఫీలౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close