అగ్ర హీరోలు తమ సినిమాల కథలు, స్క్రిప్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది.. బాధ్యత అంతా దర్శకులకు అప్పగించేస్తారు. ప్రభాస్ రెండో రకం. సెట్ కి వెళ్లామా, మన పని మనం చూసుకొన్నామా అనే టైపు. అంతే తప్ప.. మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకోరు. ‘ప్రభాస్ డైరెక్టర్ల హీరో’ అనిపించుకోవడానికి కారణం అదే. కానీ `రాజాసాబ్` విషయంలో ప్రభాస్ లో మార్పు కనిపించింది. చాలా విషయాల్లో ప్రభాస్ ఇన్వాల్వ్ అయిన సినిమా ఇది. ఆఖరికి ఎడిటింగ్ విషయంలోనూ అంతే. ప్రభాస్ దగ్గరుండి మరీ ఫైనల్ కట్ చేయించుకొన్నార్ట. అంతేకాదు.. తన సినిమా తాను చూసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ‘రాజాసాబ్’ అలా కాదు. ఈ సినిమాని ప్రభాస్ ఇప్పటికే చాలాసార్లు చూసుకొన్నార్ట. అంతేకాదు.. తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చూపించి, వాళ్ల ఇన్ పుట్స్ తీసుకొన్నార్ట. ప్రభాస్ ఇటీవలే విదేశాలకు వెళ్లిపోయారు. సంక్రాంతి తరవాత తిరిగొచ్చి షూటింగుల్లో పాల్గొంటారు. వెళ్లే ముందు.. ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఓ షో ప్రదర్శిచారని టాక్. ఆ షోకి.. ప్రభాస్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారని సమాచారం. అవుట్ పుట్ పై.. ప్రభాస్ అండ్ కో పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఇక.. అభిమానుల తీర్పే మిగిలి వుంది.
ఇది వరకెప్పుడూ లేనంత ఇన్వాల్వ్మెంట్ ఈ సినిమాలో కనిపించడం.. చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దర్శకుడు మారుతితో ప్రభాస్‌కు మంచి రాపో ఉంది. ఇద్దరూ స్నేహితుల్లా కలిసిపోయారు. అందుకే.. ఈ సినిమాపై ప్రభాస్ మరింత చనువు తీసుకొన్నట్టు కనిపిస్తోంది. అందులోనూ ప్రభాస్.. రాజమౌళి, ప్రశాంత్ నీల్, నాగ అశ్విన్ లాంటి దర్శకులతో పని చేసి వచ్చారు. వాళ్లు.. హీరోల మాట పెద్దగా వినేరకం కాదు. మారుతి అలా కాదు. తన హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటాడు. తగినంత స్పేస్ ఇస్తాడు. ప్రభాస్ లాంటి స్టార్, మార్పులూ చేర్పులూ సూచిస్తే.. మారుతి కాదనలేడు. అందుకే.. ప్రభాస్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువైంది. మారుతి కూడా ‘ఇది ప్రభాస్ దగ్గరుండి చేయించుకొన్న వంటకం’ అనేశారు. దాన్ని బట్టే ప్రభాస్ ఈ సినిమాపై తీసుకొన్న కేర్ ఎలాంటిదో అర్థం అవుతుంది.
