ప్చ్‌… ప్ర‌భాస్ ఫ్యాన్స్‌

నిరీక్ష‌ణ‌లో గ‌డిపేయ‌డం ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి అల‌వాటైపోయింది. బాహుబ‌లి, సాహో సినిమాల అప్‌డేట్స్ కోసం, ఆ సినిమాల విడుద‌ల కోసం ఎంత‌గా ఎదురు చూశారో? రాజ‌మౌళి సినిమా కాబ‌ట్టి… బాహుబ‌లి లేటుగానే బ‌య‌ట‌కు వ‌చ్చింది. భారీ బ‌డ్జెట్ సినిమా కాబ‌ట్టి.. సాహో కూడా ఆలస్యం అవుతూ వ‌చ్చింది. ఇప్పుడు ‘రాధేశ్యామ’ కూడా అంతే. ప్ర‌భాస్ – రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. రాధేశ్యామ అనే టైటిల్ దాదాపుగా ఖాయ‌మైపోయింది.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కోసం, టైటిల్ కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా.. ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నా ఎప్పుడూ, ఏదో ఓ అడ్డంకి. ఈ నెల‌లోనే ప్ర‌భాస్ సినిమా టైటిల్ చెప్పేసి, ఫ‌స్ట్ లుక్ చూపిద్దామ‌నుకుంది యూవీ క్రియేషన్స్‌. ఓ టీజ‌ర్ లాంటిది కూడా రెడీ చేసే స‌న్నాహాల్లో ప‌డింది. అయితే.. ఇప్పుడు ఆ ఆలోచ‌న విర‌మించుకున్న‌ట్టు తెలుస్తోంది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖ‌రున ప్ర‌భాస్ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సివుంది. అయితే… క‌రోనా భ‌యాలు త‌గ్గ‌కపోవ‌డం వ‌ల్ల‌, షూటింగ్ మొద‌లెట్టే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

పైగా ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లో ఓ కొత్త సెట్ నిర్మిస్తున్నారు. ఆ సెట్ ప‌నులు ఇంకా పూర్తి కాలేదు. ఆ సెట్ పూర్త‌య్యాక‌… హీరో, హీరోయిన్లు కూడా షూటింగ్ కి రెడీ అంటే, అప్పుడు ప్ర‌భాస్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. అలా షూటింగ్ పునః ప్రారంభ‌మ‌య్యే రోజున‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తారు. అంటే షూటింగ్ ప్రారంభానికీ, ఫ‌స్ట్ లుక్‌కీ లింకు ఉంద‌న్న‌మాట‌. మ‌రి ఈ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఫ‌స్ట్ లుక్ ఎప్పుడు చూస్తారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close