ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న సరికొత్త పొలిటికల్ లైన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు, విస్మయానికి దారితీస్తోంది. విజయవాడలో దారుణమైన నేరాల చరిత్ర ఉండి, అదృశ్యమైన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి, నిందితుడి ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా నేరుగా వారి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించడం ద్వారా సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే దానిపై పౌర సమాజం అవాక్కవుతోంది.
పార్టీ నేతలకు కాదు..నేరస్తులకు జగన్ పరామర్శలు
ఈ పరామర్శల వెనుక ఒక సీరియల్ పాటర్న్ కనిపిస్తోంది. ఇది కేవలం ఒక అనుకోని ఘటన కాదు.. గతంలో గుంటూరు జిల్లా తెనాలిలోనూ ఇలాగే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లకు జగన్ స్వయంగా వెళ్లి పరామర్శలు చేశారు. ఇప్పుడు విజయవాడలో బీరు సీసాలతో ఒక యువకుడిని కిరాతకంగా చంపి, ఆ రక్తపాతాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా పెట్టిన సైకో మైండ్‌సెట్ ఉన్న రౌడీషీటర్ కోసం తాడేపల్లి ప్యాలెస్ కదిలిరావడం చూస్తుంటే.. జగన్ తన రాజకీయ ఎజెండాను చాలా స్పష్టంగా, మొహమాటం లేకుండా ప్రజల ముందు ఉంచినట్లు కనిపిస్తోంది. పార్టీ నేతలు చాలా మంది జైళ్లకు వెళ్లినా పరామర్శల్లేవు కానీ..ఇలాంటి రౌడీల ఇళ్లకు వెళ్తున్నారంటే జగన్ మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
ప్రజలకు నేరుగానే తన ఉద్దేశం చెబుతున్న జగన్
జగన్ ఈ చేతల ద్వారా ప్రజలకు అత్యంత వినాశకరమైన, స్పష్టమైన సందేహాలకు తావులేని సందేశాన్ని ఇస్తున్నారు. నేను పూర్తిగా నేరగాళ్లకు, సమాజానికి హాని చేసే శక్తులకు అండగా ఉంటాను.. రేపు పొరపాటున నేను మళ్లీ అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్ర ప్రజల జీవితాలు, శాంతిభద్రతలు మళ్లీ ఈ రౌడీమూకల చేతుల్లోనే ఉంటాయి అని ఆయన తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారని సామాన్యులు భావిస్తున్నారు. తన పార్టీకి మద్దతిచ్చే కులానికి చెందిన నవీన్ రెడ్డి లాంటి సామాన్య కుటుంబాలను వదిలేసి, సమాజానికి క్యాన్సర్ లాంటి నేరగాళ్లకు రాజకీయ రక్షణ కల్పించడమే విపక్ష పంథాగా మారడం ఏపీ చరిత్రలోనే నేర రాజకీయం.
తేల్చుకోవాల్సింది జగన్ మద్దతుదారులే !
ప్రభుత్వంపై ప్రజాపోరాటాలు చేయడమంటే ప్రజల పక్షాన నిలబడటం.. అంతే కానీ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్స్ వెనుక నిలబడటం కాదనే కనీస లాజిక్‌ను వైసీపీ విస్మరించింది. జగన్ తీసుకుంటున్న ఈ వివాదాస్పద నిర్ణయాలు కూటమి ప్రభుత్వానికి బురదజల్లడం పక్కన పెడితే.. సగటు ఓటర్లలో వైసీపీ పట్ల తీవ్ర అసహ్యానికి, భయానికి కారణమవుతున్నాయి. నేరగాళ్లకు కొమ్ముకాసే ఇటువంటి ‘రాజకీయ సంస్కృతి’ రాష్ట్రానికి అవసరమా లేదా అనేది తేల్చుకోవాల్సిన బాధ్యతను జగన్ తన పర్యటనల ద్వారా ప్రజలకే వదిలేశారని, రాబోయే రోజుల్లో ప్రజలు దీనిపై మరింత నిర్మొహమాటంగా తమ తీర్పును ఇవ్వడం ఖాయం
