ప్ర‌భాస్ సినిమా టైటిల్ మారుస్తారా?

ప్ర‌భాస్ – రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. పూజా హెగ్డే క‌థానాయిక‌. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కోసం ప్ర‌భాస్ అభిమానులు ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. టైటిల్ కూడా చెప్ప‌లేదు. `జాన్‌`, `రాధే శ్యామ్‌` పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అయితే చిత్ర‌బృందం అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. ఈ నెల‌లోనే ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. జాన్‌, రాధేశ్యామ్‌.. పేర్లు రెండూ బాగా న‌లిగిపోయాయి. ప్ర‌భాస్‌సినిమా మొద‌లెన‌ప్ప‌టి నుంచీ జానూ పేరు ప‌ల‌వ‌రిస్తూనే ఉన్నారు జ‌నాలు. అందుకే ఆ టైటిల్ ప్ర‌క‌టించినా కొత్త ఫీల్ ఏమీ అనిపించ‌దు. రాధే శ్యామ్ కూడా టెస్టింగ్ టైటిల్ అన్న‌ట్టు తెలుస్తోంది. ఇవి రెండూ కాకుండా కొత్త పేరు ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. టైటిల్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చిందో, అప్ప‌టి నుంచీ క్ర‌మంగా అప్‌డేట్లు ఇవ్వాల‌ని యూవీ క్రియేష‌న్స్ భావిస్తోంది. సో ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇక పండ‌గే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close