చంద్రబాబు కరోనా టెస్ట్‌కు పోలీసులే అడ్డం..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోా పరీక్షలు చేయాలని ప్రయత్నించిన కృష్ణా జిల్లా అధికారులకు పోలీసులు సహకరించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. శని, ఆదివారాలు హైదరాబాద్‌లో ఉండి.. సోమవారం.. చంద్రబాబు అమరావతికి వచ్చారు. ఆయన అమరావతి వస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు.. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కాన్వాయ్‌ను నిలిపివేసి.. కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు.. కలెక్టర్‌ను స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. రెవిన్యూ అధికారులు.. టెస్టులు చేసే వైద్య బృందంతో కలిసి గరికపాడు చెక్ పోస్ట్‌వద్దకు వచ్చారు. అయితే.. చంద్రబాబు కాన్వాయ్‌ను నిలిపేందుకు పోలీసులు అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం.. జడ్ ప్లస్ కేటగరిలో ఉన్న వ్యక్తి కాన్వాయ్‌ను నిలిపివేసి పరీక్షలు చేయడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో కాన్వాయ్ సాఫీగా వెళ్లిపోయింది.

చంద్రబాబుకు కరోనా టెస్టులు చేస్తామని.. రెవిన్యూ వర్గాలు.. మీడియాకు ముందే సమాచారం ఇచ్చాయి. దాంతో ఆ సమయానికి గరికపాడు వద్ద పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు కూడా గుమికూడారు. ా సమయంలో పోలీసులు నిబంధనలు చెప్పి.. కాన్వాయ్‌ను ఆపలేదు. దాంతో రెవిన్యూ అధికారులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. నిజానికి చెక్ పోస్టుల వద్ద .. ఏపీలోకి ప్రవేశించేవారందరికీ ఎలాంటి పరీక్షలు చేయడం లేదు. ప్రతీ రోజు కొన్ని వందల మంది అధికారులు..నేతలు అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు. పాసులున్న వారికి క్వారంటైన్ చెప్పి పంపిస్తున్నారు. సామాన్యులకు ఓ రకంగా.. ప్రభుత్వానికి సంబంధించిన వారికి ఇంకో రకంగా టెస్టుల ప్రక్రియ నడుస్తోంది.

అయితే.. చంద్రబాబు అనే సరికి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం ఇటీవలి కాలంలో ఎక్కువ అయింది. చంద్రబాబుకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి అనిల్ లాంటి వాళ్లు ప్రకటించారు. దీంతో. చెక్ పోస్ట్ వద్ద నిలిపివేసి కరోనా పరీక్షలు చేస్తారేమోనని అందరూ భావించారు. కానీ.. పోలీసులు మాత్రం అంగీకరించలేదు. పోలీసులు ఇలా… కలెక్టర్ ఆదేశాలను కాదని.. రూల్స్ పాటించాలని చెప్పడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం అని అంటున్నారు. మొత్తానికి ఈ ఘటన మాత్రం… అటు అధికారవర్గాల్లోనూ.. ఇటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close