ప్ర‌భాస్‌తో త్రివిక్ర‌మ్‌?

తెలుగు తెర‌పై మ‌రో క్రేజీ కాంబినేష‌న్‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ – బాహుబ‌లి ప్ర‌భాస్ క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. అవును.. అన్నీ కుదిరితే ఈ యేడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అయితే దీనికి చాలా స‌మీక‌ర‌ణాలు క‌లిసిరావాలి.

ఒక‌టి… అల వైకుంఠ‌పురం హిట్ అవ్వాలి. క‌నీసం మంచి టాక్‌తో సాగి, సంక్రాంతి సీజ‌న్‌కి త‌గిన వ‌సూళ్లు రాబ‌ట్టుకుంటే చాలు. రెండోది ‘జాన్‌’ మేలోగా పూర్త‌వ్వాలి. ఇవి రెండూ జ‌రిగితే మాత్రం ఈ కాంబినేష‌న్‌ని చూడొచ్చు. ప్ర‌భాస్ తో ప‌నిచేయాల‌ని, త్రివిక్ర‌మ్‌… త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేయాల‌ని ప్ర‌భాస్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ‘జాన్’ త‌ర‌వాత ప్ర‌భాస్ సినిమా ఏమిట‌న్న విష‌యంలో ఇంకా ఓ క్లారిటీ లేదు. శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓసినిమా వ‌స్తోంద‌ని చెబుతున్నా – అది ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంతో చెప్ప‌లేం. ప్ర‌భాస్ కూడా.. యాక్ష‌న్‌తో ప‌నిలేకుండా, పాన్ ఇండియా లాంటి గొడ‌వ‌లు లేకుండా ఓ కంప్లీట్ ఫ్యామిలీ సినిమా చేయాల‌నుకుంటున్నాడు. దానికి త్రివిక్ర‌మ్ అయితేనే బాగుంటుంది. పైగా ‘అల‌.. వైకుంఠ‌పుర‌ములో’ త‌ర‌వాత త్రివిక్ర‌మ్ ఎవ‌రికీ క‌మిట్‌మెంట్ ఇవ్వ‌లేదు. ప్ర‌భాస్‌కి స‌రిపోయే లైన్ త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఇద్ద‌రి మ‌ధ్య భేటీ ఏమీ జ‌ర‌గ‌లేదు. కాక‌పోతే.. వీరిద్ద‌రినీ క‌లిపి కూర్చోబెట్టే బాధ్య‌త‌ని ఓ పెద్ద నిర్మాత తీసుకున్నాడు. ఆ మీటింగ్ సంక్రాంతి అయ్యాకే ఉండ‌బోతోంది. ఆ త‌ర‌వాతే… ఈ కాంబినేష‌న్‌పై ఓ క్లారిటీ వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చేశారు..!

వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా..ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు. ఎప్పటిలాగే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీలోని కొంత మంది వ్యక్తులు కూడా...

ఎస్ఈసీ ఆర్డినెన్స్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ సర్కార్..!

ఎస్ఈసీ అర్హతలు మార్చుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ...ఎస్ఎల్పీ దాఖలు...

శంకించొద్దు.. జగన్‌కు విధేయుడినే : విజయసాయిరెడ్డి 

తాను చనిపోయేవరకు జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. నన్ను శంకించాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వైఎస్ జగన్ కు... అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్న ఆయన...

అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్...

HOT NEWS

[X] Close
[X] Close