అర‌వింద్ మాట విన‌ని త్రివిక్ర‌మ్‌

త‌న‌యుడి సినిమా అంటే అల్లు అర‌వింద్ జాగ్ర‌త్త‌ప‌డిపోతారు. ఫైన‌ల్ అవుట్ పుట్ బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు త‌ప్ప‌కుండా ఆయ‌న కొన్ని క‌రక్ష‌న్స్ చెప్ప‌డం, దాన్ని ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు తుచ త‌ప్ప‌కుండా పాటించ‌డం ప‌రిపాటి. అయితే… `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమా విష‌యంలో మాత్రం అర‌వింద్ మాట చెల్లుబాటు కాలేద‌ని తెలుస్తోంది. ఫైన‌ల్ కాపీ వ‌చ్చాక అర‌వింద్ ఈ సినిమా రెండు మూడు సార్లు చూసేశారు. ఆయ‌న‌కంటూ కొన్ని మార్పులు సూచించారు కూడా. నిడివి విష‌యంలో అర‌వింద్ ప‌ట్టుగా ఉన్నార‌ని, ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాల్ని ట్రిమ్ చేయాలని ఆయ‌న సూచించార‌ని, అయితే త్రివిక్ర‌మ్ మాత్రం అర‌వింద్ మాట విన‌లేద‌ని. త‌న మాట‌ల‌తో ఆయ‌న్ని క‌న్వెన్స్ చేసి – ఒప్పించాడ‌ని తెలుస్తోంది.

అంతేకాదు.. ‘సామ‌జ‌వ‌ర‌గమ‌న‌’ పాట‌ని విదేశాల్లో తెర‌కెక్కించ‌డం కూడా అర‌వింద్‌కి న‌చ్చ‌లేద‌ట‌. ఆ పాట‌ని ఇండియాలోనే తీయాల‌ని సూచించార‌ట‌. కానీ… పాట సూప‌ర్ హిట్టయ్యింద‌ని, దాన్ని సాదా సీదాగా తీస్తే కుద‌ర‌ద‌ని ప‌ట్టుబ‌ట్టి మరీ త్రివిక్ర‌మ్ ఆ పాట‌ని విదేశాల్లో తెర‌కెక్కించాడ‌ట‌. అయితే… త్రివిక్ర‌మ్ నిర్ణ‌యాల్ని ముందు విబేధించినా, ఆ త‌ర‌వాత అల్లు అర‌వింద్ స‌ర్దుకుపోయార‌ని టాక్‌. అల్లు అర‌వింద్ ఓ ద‌ర్శ‌కుడి మాటు త‌లొంచ‌డం, పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌డం బ‌హుశా ఆయ‌న కెరీర్‌లోనే ఇదే మొద‌టిసారేమో…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వీడు మామూలోడు కాదు..! ఏకంగా లంచం కోటి..!

అవినీతిని అరికట్టేందుకు రూ. 2వేల నోట్లను కేంద్రం నియంత్రించేసింది కానీ.. అదేమీ ఈ తరహా సంపాదనకు అలవాటు పడిన వారికి అడ్డం కాలేదు. రూ. 2వేల నోట్లు కాకపోతే.. రూ. ఐదు వందల...

షాకింగ్ : హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్..!?

ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయమైన పరిణామాలు రోజు రోజుకు వెలుగు చూస్తున్నాయి. అక్కడ న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బ కొట్టేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయని మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ఫోన్ సంభాషణతో వెల్లడయింది. తాజాగా ఇప్పుడు.. న్యాయమూర్తుల...

విశాఖలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాదు ఓటు బ్యాంకుకు ఇళ్ల స్థలాలు..!

ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నంను చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ప్రభుత్వం... దానికి తగ్గట్లుగా "లుక్" ఉండే ప్రాజెక్టులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి రద్దు చేసుకుంటూ పోతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్యాన్సిల్ చేస్తోంది. ఓ...

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమం..!

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని .. చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనను ఐసీయూలోకి షిఫ్ట్ చేశామని .. లైఫ్ సపోర్ట్...

HOT NEWS

[X] Close
[X] Close