రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే ఈ వేడుక ప‌రిమిత‌మైంది. టాలీవుడ్ నుంచి ఈ పెళ్లికి హాజ‌రైన వాళ్ల‌లో రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్నీ మాత్ర‌మే ఉన్నారు. ద‌గ్గుబాటి వారి కోడ‌లు కాబ‌ట్టి స‌మంత‌.. క‌నిపించింది. నాగ‌చైత‌న్య స‌రే స‌రి. వ‌స్తాడనుకున్న ప్ర‌భాస్ క‌నిపించ‌లేదు. ప్ర‌భాస్ – రానాలు `బావా.. బావా` అని పిలుచుకుంటారు. `బాహుబ‌లి` కోసం దాదాపు ఐదేళ్లు క‌ల‌సి ప‌నిచేశారు. ఆ బాండింగ్ మ‌రింత స్ట్రాంగ్‌. దాంతో ఈ పెళ్లికి ప్ర‌భాస్ త‌ప్ప‌కుండా వ‌స్తాడ‌నుకున్నారు. కానీ.. ప్ర‌భాస్ బావ క‌నిపించ‌లేదు. అతిథుల లిస్టులో ప్ర‌భాస్ లేడ‌ని, కేవ‌లం చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌కు మాత్రమే ఇన్విటేష‌న్ అందింద‌ని టాక్‌. చ‌ర‌ణ్‌.. రానాకి చిన్న‌ప్ప‌టి నుంచీ దోస్త్. బ‌న్నీ కూడా అంతే. అందుకే వాళ్ల‌కే ఆహ్వానాలు అందాయి. పెళ్లికి కేవ‌లం 50మందే రావాల‌న్న నిబంధ‌న వ‌ల్లే.. చాలామంది స్నేహితులు, ఆప్తుల్ని ఈ పెళ్లికి పిల‌వ‌లేక‌పోయాడు రానా. అయితేనేం… త్వ‌ర‌లోనే రానా ఓ బ్ర‌హ్మాండ‌మైన పార్టీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఆ పార్టీలో ప్ర‌భాస్ బావ క‌నిపించ‌డం ఖాయంలా అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

టీడీపీ నుంచి పురందేశ్వరికి సపోర్ట్..!

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి ప్రశంసలు కన్నా ఏపీలో ఎక్కువగా విమర్శలే వస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన నేతలు పెద్దగా అభినందించినట్లుగా కనిపించలేదు కానీ...

పారితోషికాల త‌గ్గింపు.. పెద్ద జోక్‌

ఇండ్ర‌స్ట్రీలో ఎప్పుడూ ఓ మాట వినిపిస్తుంటుంది. ''బ‌డా స్టార్లు పారితోషికాలు త‌గ్గించుకోవాలి..'' అని. త‌రాలు మారినా, ప‌రిస్థితులు మారినా.. ఈ మాట మాత్రం మార‌లేదు. హీరోలు పారితోషికాలు త‌గ్గించుకోలేదు.. నిర్మాత‌లు త‌గ్గించి ఇచ్చిన...

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

HOT NEWS

[X] Close
[X] Close