వంద‌ల కోట్లు కాదంటున్న ప్ర‌భాస్‌

బాహుబ‌లితో ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. త‌ను ఇప్పుడు అస‌లు సిస‌లైన పాన్ ఇండియా స్టార్‌. తెలుగులో సాహో అంతంత మాత్రంగానే ఆడినా, నార్త్ లో దుమ్ము రేపింది. అదీ… ప్ర‌భాస్ స్టామినాకు నిద‌ర్శం. `రాధే శ్యామ్‌` కి తెలుగులో పెద్ద‌గా బ‌జ్ లేదు. కానీ.. నార్త్ లో ఈ సినిమా గురించి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబ‌లికి ముందు, ఆ త‌ర‌వాత ప్ర‌భాస్ పారితోషికంలో ఊహించ‌నంత మార్పు వ‌చ్చింది. త‌న బ్రాండ్ విలువ పెరిగింది.

అయితే.. మిగిలిన హీరోల్లా.. త‌ను త‌న బ్రాండ్ వాల్యూని క్యాష్ చేసుకోవ‌డం లేదు. ఇటీవ‌ల త‌న‌కు చాలా క‌మ‌ర్షియ‌ల్ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కొన్ని కార్పొరేట్ సంస్థ‌లు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్ర‌భాస్ ని ఎంచుకోవాల‌ని భారీ ప్ర‌య‌త్నాలు చేశాయి. వంద‌ల కోట్ల ఆఫ‌ర్లు ఇస్తామ‌న్నాయి. కానీ… ప్ర‌భాస్ ఒప్పుకోవ‌డం లేదు. ఈనెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఏకంగా వంద కోట్ల రూపాయ‌ల ఆఫ‌ర్ల‌ని కాద‌న్నాడ‌ని టాక్. మామూలుగా అయితే, క‌మ‌ర్షియ‌ల్ యాడ్ల రూపంలో భారీగా సంపాదించే అవ‌కాశం ఎప్పుడు వ‌చ్చినా, ఎవ‌రూ వ‌దులుకోరు. క్రేజ్ ఉన్న‌ప్పుడే వీలైనంత పిండుకోవ‌డానికి చూస్తుంటారు. పైగా సినిమాల్లా.. యాడ్ల కోసం నెల‌లు, సంవ‌త్స‌రాలూ కేటాయించాల్సిన అవ‌స‌రం లేదు. చేతిలో ఎన్ని బ్రాండ్లు ఉంటే అంత వాల్యూ అనుకుంటుంటారు. కానీ ప్ర‌భాస్ మాత్రం వాటి గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న ఫోక‌స్ కేవ‌లం సినిమాల‌పైనే ఉంది. మిగిలిన విష‌యాల్ని ప్ర‌భాస్ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే కోట్ల రూపాయ‌ల్ని వ‌దులుకుంటున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“భళా తందనానా” అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !

క్రైమ్ సినిమాలు చూశాం. ఎమోషనల్ సినిమాల డెప్త్ మనకు తెలుసు. సస్పెన్స్ సినిమాలు మనల్ని అలరించాయి. సినిమాల్లో డ్రామాకి బాగా కనెక్ట్ అవుతాం. కానీ వీటన్నిటినీ కలిపి ఒక కథగా తయారు ...

టీచర్ ప్రసాద్ శ్రమను దోచేశారు !

రాజకీయాలంటే అంతే. ఎవడో కష్టపడిన దాన్ని తమ ఖాతాలో వేసుకోవడం. అధికారం ఉంది కదా అని పిలిచి.. తమ వల్లే వారికి ఆ సక్సెస్ దొరికిందని స్టేట్ మెంట్ ఇప్పించుకోవడం. అలా ఇవ్వకపోతే...

ఢిల్లీ నుంచి కేసీఆర్ దేశవ్యాప్త టూర్స్ – ఇక జాతీయ రాజకీయాలకే ఫిక్స్ !

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వారం పది రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీలో మేధావులు, మీడియా ప్రతినిధులతో మేథోమథనం జరుపుతారు. ఆ...

ఎడిటర్స్ కామెంట్ : జ్ఞానవాపి మరో బాబ్రీ !

" జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడింది.. అక్కడ ఉన్న గుడిని కూలగొట్టి ముస్లిం రాజు ముసీదు నిర్మించారు. ఇప్పుడు మళ్లీ గుడిని పునరుద్ధరించాలి" అన్న డిమాండ్ బయలుదేరింది. వెంటనే ఒవైసీ లాంటి వాళ్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close