రౌడీ బాయ్స్ ట్రైల‌ర్‌: కాలేజ్ క‌హానీ!

చిత్ర‌సీమ‌లో కాలేజీ క‌థ‌ల‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. సినిమాల‌కు మ‌హారాజ పోష‌కులు యువ ప్రేక్ష‌కులే కాబ‌ట్టి.. కాలేజ్ అంటేనే యూత్ కాబ‌ట్టి, కాలేజ్ స్టోరీ క్లిక్ అయితే.. ప్రేమ‌దేశం, హ్యాపీడేస్‌లు అయిపోతాయి. చాలా వ‌ర‌కు యూత్ ఫుల్ క‌థ‌ల‌కు కాలేజ్‌కేరాఫ్ అడ్ర‌స్స్‌. అయితే ఈమ‌ధ్య కేవ‌లం కాలేజీల చుట్టూ న‌డిచే సినిమాలు రాలేదు. రౌడీ బాయ్స్ తో ఆ లోటు తీర‌బోతోంది. దిల్ రాజు ఇంటి నుంచి వ‌చ్చిన ఆశిష్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా ఉండ‌డం, దిల్ రాజు నిర్మాత కావ‌డం, పైగా కాలేజీ స్టోరీ అవ‌డం వ‌ల్ల‌.. ఈసినిమాపై ఫోక‌స్‌ప‌డింది. ఇప్పుడు ట్రైల‌ర్ ని ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

145 సెక‌న్ల టీజ‌ర్ ఇది. సినిమా మొత్తంకాలేజీ బ్యాక్ డ్రాప్‌లోనే సాగ‌బోతోంద‌న్న సంగ‌తి ట్రైల‌ర్ తోనే అర్థ‌మైంది. ఓ ఆవారా హీరో, త‌న కంటే రెండేళ్లు వ‌య‌సెక్కువ ఉన్న అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌డం, త‌న‌ని ఇంప్రెస్ చేయ‌డానికి ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నించ‌డం, కాలేజీలో మ‌రో గ్యాంగ్. వాళ్ల‌తో గొడ‌వ‌లు, కొట్టుకోవడాలు, స‌వాళ్లు విసురుకోవ‌డాలూ.. ప్రేమ‌, వాటిలో వైఫ‌ల్యం.. ఇలా మొత్తం సినిమాని ట్రైల‌ర్ లో చూపించేశారు. యూత్ ఫుల్ సినిమా కాబ‌ట్టి.. వాళ్ల‌కు న‌చ్చేలానే హీరో పాత్ర‌ని డిజైన్ చేశారు. ఆశిష్ జోవియ‌ల్ గానే క‌నిపిస్తున్నాడు. డాన్సుల్లో కూడా ఈజ్ క‌నిపించింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ సినిమాకి ప్ల‌స్‌. దేవిశ్రీ ప్ర‌సాద్ లాంటి టెక్నీషియ‌న్ తోడ‌వ్వ‌డం, దిల్ రాజు బ్యాన‌ర్ అవ్వ‌డంతో టెక్నిక‌ల్ గానూ ఈసినిమా బాగానే వ‌చ్చింద‌న్న సంకేతాలు అందుతున్నాయి. ఓ అమ్మాయి కోసం ఇద్ద‌రుఅబ్బాయిలు ఢీ కొట్టుకోవ‌డం, అందులోంచి పుట్టే డ్రామా.. ఈ సినిమా క‌థ‌ని ప్ర‌ధాన‌మైన పునాది కావొచ్చు. యూత్ కి న‌చ్చితే.. దిల్ రాజు ప్లాన్ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.