రాజాసాబ్ టీజర్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రభాస్ చూడ్డానికి బాగున్నాడు. విజువల్స్ కూడా అదిరాయి. ఈ టీజర్ తో ఈ సినిమాపై నమ్మకాలు, అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ టీజర్ వేడుకలో రాజాసాబ్ లెంగ్త్ గురించి దర్శకుడు మారుతి నోరు జారాడు. ‘సినిమా మూడున్నర గంటలు’ అంటూ చెప్పేశాడు. ఆ తరవాత.. ‘మూడు గంటలే’ అని సర్దాడు.
ఈ సినిమాకు సంబంధించి చాలా కంటెంట్ తీశాడు మారుతి. ఇప్పటికే మూడు గంటల సినిమా తయారైంది. తీయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. పాటలు బాలెన్స్. అవన్నీ కలిపితే మూడున్నర గంటలు గ్యారెంటీ. దాన్ని ఎంత ట్రిమ్ చేసినా మూడు గంటల లెక్క తేలుతుంది.
ఓ దశలో ఫుటేజ్ చూసిన నిర్మాత ఈ సినిమాని రెండు భాగాలుగా మారిస్తే ఎలా ఉంటుంది? అనే ఐడియా ఇచ్చార్ట. కానీ మారుతి ఒప్పుకోలేదు. ఎందుకంటే రాజాసాబ్ 2 కి సంబంధించిన ఐడియా మారుతి దగ్గర రెడీగా వుంది. పార్ట్ 2కి చాలా డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాడని తెలుస్తోంది. అందుకే మారుతి ఒప్పుకోలేదు.
ఒక్కటి మాత్రం నిజం. లెంగ్త్ పరంగా రాజాసాబ్ పెద్దదే. పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2 హాలీవుడ్ రేంజ్లో తీస్తామని ఇప్పటికే నిర్మాత విశ్వ ప్రసాద్ ప్రకటించేశారు. డిసెంబరు 5న రాజాసాబ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.