నికార్స‌యిన‌ మాస్: ఛ‌త్ర‌ప‌తికి 15 ఏళ్లు

హీరోయిజానికి చాలామంది చాలా అర్థాలు చెప్పారు. చెడుని ఎదిరించే వాడే హీరో అన్న‌ది జగం ఎరిగిన నిర్వ‌చ‌నం. అయితే ఆ టైమింగ్ ని కాస్త మార్చి – హీరోయిజాన్ని ఎవ‌రెస్ట్ పై కూర్చోబెట్టిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ఆయ‌న సినిమాల్లోనూ హీరో చెడుపైనే పోరాటం చేస్తాడు. కానీ.. కొంచెం స‌మ‌యం తీసుకుంటాడు. అన్యాయాన్ని భ‌రించీ, స‌హించీ.. విసిగి వేసారి.. `ఇక చాలూ…..` అంటూ ఒక్కసారిగా ఉగ్ర‌రూపం దాల్చుతాడు. `హీరో విల‌న్ ని కొట్టి తీరాల్సిందే..` అని థియేట‌ర్లో జ‌న‌మే ఎద‌రు చూసేలా ఆడిటోరియాన్ని సిద్ధం చేస్తాడు. అప్పుడే హీరోయిజం పండుతుంది. `ఛ‌త్ర‌ప‌తి`లో రాజ‌మౌళి చూపించిందీ.. ప్ర‌భాస్ చేసిందీ అదే.

పాట‌లు, ఫైట్లూ, సెంటిమెంట్‌, రొమాన్స్‌.. ఇలా అన్నీ మేళ‌వించిన సినిమా `ఛ‌త్ర‌ప‌తి`. మామూలుగా చూస్తే ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌. దాన్ని రాజ‌మౌళి త‌న‌దైన టేకింగ్ తో.. ప్ర‌త్యేకంగా నిలిపాడు. ప్ర‌భాస్ లోని అస‌లైన మాస్ ని 70 ఎం.ఎంలో ఎలివేట్ చేసి – మాస్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేశాడు. అందుకే అటు రాజ‌మౌళి కెరీర్‌లోనూ, ఇటు ప్ర‌భాస్ కెరీర్‌లోనూ.. `ఛ‌త్ర‌ప‌తి` ఓ ప్ర‌త్యేక చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమా విడుద‌లై నేటికి ప‌దిహేనేళ్లు.

గూజ్‌బ‌మ్స్ మూమెంట్స్‌కి రాజ‌మౌళి సినిమాల్లో కొద‌వ ఉండ‌దు. ఈ సినిమాలో మాత్రం అలాంటి స‌న్నివేశాలు చాలా క‌నిపిస్తాయి. తొలిసారి ప్ర‌భాస్ ప్రత్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌డం ద‌గ్గ‌ర్నుంచి అస‌లైన ఆట మొద‌ల‌వుతుంది. `ఒక్క అడుగు..`అంటూ విశాఖ మ్యాప్ పై కాలు మోప‌డం ద‌గ్గ‌ర హీరోయిజం ఆకాశ‌మంత ఎత్తుకు ఎదుగుతుంది. అక్క‌డి నుంచి… ఛ‌త్ర‌పతి వేసిన ప్ర‌తి అడుగులోనూ.. మాస్ కి న‌చ్చే అంశాలు, ఫ్యాన్స్ ఖుషీ అయిపోయే విష‌యాలు కుప్ప‌లు తెప్ప‌లుగా ఉంటాయి. దానికి తోడు.. హుషారెత్తించే పాట‌లు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో వేణుమాధ‌వ్ కామెడీతో… కావ‌ల్సినంత రిలీఫ్ దొరుకుతుంది. ఫ‌ఫీలోని న‌టుడ్ని రాజ‌మౌళి వాడుకున్నంత‌గా ఆ త‌ర‌వాత మ‌రెవ‌రూ వాడుకోలేదు. భానుప్రియ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ సినిమాతో భానుప్రియ‌కు ఉత్త‌మ స‌హాయ న‌టిగా నంది పుర‌స్కారం దక్కింది. అప్ప‌ట్లో కేవ‌లం 8 కోట్ల‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. ఏకంగా 30 కోట్లు సాధించి ఆ యేడాది అత్యంత విజ‌వంత‌మైన చిత్రాల జాబితాలో అగ్ర స్థానంలో కూర్చుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close