ఐపీఎల్ స్టోరీస్‌: భార‌త‌ బ్యాట్స్‌మెన్ల జోరు

ఐపీఎల్ అంటే క‌ల‌గూర‌గంప‌. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ స్టార్ ప్లేయ‌ర్లంతా ఒకే చోట క‌నిపిస్తారు. సాధార‌ణంగా ఐపీఎల్‌లో వాళ్ల జోరే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఉప‌ఖండం పిచ్‌ల‌కు బాగా అల‌వాటు ప‌డ‌డానికి ఐపీఎల్ వాళ్ల‌కు ఓ వేదిక‌. భార‌త‌లో మ్యాచ్‌లంటే చెల‌రేగిపోతారు. అయితే ఈసారి దుబాయ్‌లో ఐపీఎల్ జ‌రుగుతోంది. సెంటిమెంట్‌కి విరుద్ధంగా… విదేశీ బ్యాట్స్‌మెన్‌ల స్థానంలో భార‌త బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోతున్నారు. ఇప్పటి వ‌ర‌కూ జ‌రిగిన మ్యాచుల‌లో మ‌న‌వాళ్ల‌దే హ‌వా.

ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ ఇప్పుడు కె.ఎల్‌.రాహుల్ ద‌గ్గ‌ర ఉంది. మూడు మ్యాచ్‌ల‌లో ఏకంగా 222 ప‌రుగులు సాధించాడు రాహుల్‌. అందులో ఓ సెంచ‌రీ కూడా ఉంది. రెండో స్థానంలో మ‌యాంక్ అగ‌ర్వాల్ (221) ఉన్నాడు. రాహుల్ కీ, మ‌యాంక్ కీ తేడా ఒక్క ప‌రుగే. ఇద్ద‌రూ పంజాబ్ త‌ర‌పున ఆడుతున్నారు. ఈసీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ పంజాబ్ అగ్ర‌స్థానంలో ఉందంటే..కార‌ణం వీళ్లే. సంజూ శాంసంగ్ 3 మ్యాచ్‌ల‌లో 159 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 16 సిక్సులున్నాయి. బెంగ‌ళూరు ఓపెన‌ర్ ప‌డిక్క‌ల్ 111 ప‌రుగులు సాధించాడు. రోహిత్ శ‌ర్మ (100), పంత్‌, మ‌నిష్ పాండే, గిల్‌.. వీళ్లంతా పరుగులు రాబ‌డుతున్నారు. స్టార్ ప్లేయ‌ర్లు కోహ్లి, హార్దిక్ పాండ్యా, ధోనీ లాంటి వాళ్లు త‌డ‌బ‌డుతున్న పిచ్‌ల‌పై.. కుర్ర గ్యాంగ్ రెచ్చిపోయి సిక్సులు బాదుతున్నారు. సంజూ శాంసంగ్‌, గిల్, ప‌డిక్క‌ల్ వీళ్లంతా భార‌త‌జ‌ట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న‌వాళ్లే. ఈ ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న తో సెల‌క్ట‌ర్ల దృష్టిలో ప‌డ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే స్టార్ బ్యాట్స్‌మెన్‌ల‌ను త‌ల‌ద‌న్నేలా ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. రాబోయే మ్యాచ్‌ల‌లో వీళ్లెలా ఆడ‌తార‌న్న‌ది ఆసక్తి రేపుతోంది. త‌మ‌ది ఆరంభ శూర‌త్వం కాద‌ని నిరూపించుకోవాలంటే ఈ నిల‌క‌డ‌, దూకుడు.. ముందు కూడా కొన‌సాగించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close