“బాబ్రీ” కేసులో అందరూ నిర్దోషులే..!

బాబ్రీ కేసు కూల్చివేత ఘటన కేసులో బీజేపీ సీనియర్ నేతలందరికీ క్లీన్ చిట్ లభించింది. ప్రామాణికమైన సాక్ష్యాలు లేవని లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు .. కేసును కొట్టి వేసింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది నిర్దోషులుగా తేలారు. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కాదని.. తీర్పు సందర్భంగా సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కూల్చివేత ప్రణాళికాబద్దంగా జరగలేన్నారు. సీబీఐ సమర్పించి ఆడియో, వీడియో టేపులు ప్రామాణికం కాదన్నారు. 1992 డిసెంబర్‌ 6న ఆయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. 28 ఏళ్ల తర్వాత కేసు తీర్పు వెలువడింది.

మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితులుగా బీజేపీ సీనియర్‌ నేతలు ఆడ్వాణీ, మురళీ మనోహర్‌జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతితో పాటు వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ నేతలున్నారు. మసీదు కూల్చివేతకు నేర పూరిత కుట్ర పన్నారని అద్వానీతో పాటు పలువురిపై సీబీఐ అభియోగాలు నమోదుఏసింది. 2001లోనే అద్వానీతో సహా ఇతరులపై కుట్రపూరిత ఆరోపణలను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును అలహాబాద్‌ కోర్టు సమర్థించింది. అలహాబాద్‌ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఓవర్‌రూల్‌ చేసింది. అద్వానీతో పాటు ఇతరులపై నమోదైన నేరపూరిత కుట్ర అభియోగాలను రీస్టోర్‌ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ మేరకు విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. అదే తీర్పును వెలువరించింది.

మసీదు కూల్చివేత కుట్ర ప్రకారం జరగలేదని.. నిందితులు కోర్టులో వాదిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ నేతలు అయోధ్య వెళ్లిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని సందర్శించామని అప్పుడు కొందరు ఆవేశంతో మసీదును కూల్చివేశారని వారు వాదించారు. నాయకులెవ్వరూ కరసేవకులను రెచ్చగొట్టలేదన్నారు. ఈ వాదన ప్రకారమే.. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత కోర్టు కేసుల్లో ఇటీవలే అక్కడ రామాలయం నిర్మించాలని తీర్పు చెప్పారు. ఆ ప్రకారం రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమయింది. ఇప్పుడు బాబ్రీ కేసులో బీజేపీ నేతలు కూడా.. క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close