ప్ర‌భాస్ …. హ‌లీడే ట్రిప్‌

ఎక్క‌డ చూసినా రాధేశ్యామ్ హ‌డావుడే. ప్ర‌మోష‌న్లు జోరుగా సాగుతున్నాయి. ప్ర‌భాస్ అండ్ టీమ్‌… దేశ‌మంతా చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌స్తుతం.. హైద‌రాబాద్‌లో తెలుగు మీడియాకు ప్ర‌భాస్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. ఆదివారం టీవీ ఛాన‌ళ్ల‌కు, సోమ‌వారం పేప‌ర్‌, వెబ్ సైట్‌ల‌కు ఇంట‌ర్వ్యూ షెడ్యూల్ కేటాయించారు. ఆదివారం దాదాపు ప‌ది ఛాన‌ళ్ల‌కు ప్ర‌భాస్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. ముంబై, చెన్నై, బెంగ‌ళూరు అంటూ వ‌రుస‌గా ప్ర‌మోష‌న్ ఈవెంట్ల‌లో పాల్గొంటున్న ప్ర‌భాస్ రోజంతా టీవీ ఛాన‌ళ్ల‌కు కేటాయించాడు. ఒక్కో ఛాన‌ల్ కీ దాదాపు అర‌గంట పాటు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ వెళ్లాడు. చెన్నైలో కూడా అంతే. చిన్న చిన్న టీవీ ఛాన‌ళ్ల‌కు కూడా ప్ర‌భాస్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. గ‌త రెండు మూడు రోజులుగా ప్ర‌భాస్ మాట్లాడుతూనే ఉన్నాడు. ప్ర‌భాస్ ఓపిక చూసి చిత్ర‌బృంద‌మే ఆశ్చ‌ర్య‌పోతోంది.

ఈనెల 11న రాధేశ్యామ్ వ‌స్తోంది. అయితే అంత‌కు ముందే ప్ర‌భాస్ హాలీడే కోసం యూర‌ప్ వెళ్ల‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఢిల్లీ, కేర‌ళ‌లో ప్రెస్‌మీట్లు ఉన్నాయి. అవి చూసుకుని ఫారెన్ చెక్కేస్తున్నాడు. రాధేశ్యామ్ రిజ‌ల్ట్ వ‌చ్చే నాటికి.. హాలీడే స్పాట్ లో ఉండాల‌న్న‌ది ప్ర‌భాస్ ప్లాన్‌. సాహో సినిమాకీ అంతే. విడుద‌ల‌కు ముందే ప్ర‌భాస్ ఫారెన్ వెళ్లిపోయాడు. ఈసారీ అదే ప‌ద్ధ‌తి ఫాలో అవుతున్నాడు. ఈమ‌ధ్య ప్ర‌భాస్ తీరిక లేని షెడ్యూళ్ల‌తో గ‌డుపుతున్నాడు. నెల‌లో 30 రోజులు ఉంటే, ఒక్కో సినిమాకీ ప‌దేసి రోజులు కేటాయిస్తున్నాడు. అందుకే… కొన్ని రోజులు వ‌ర్క్ పక్క‌న పెట్టి, ఎంజాయ్ చేయాల‌నుకుంటున్నాడు ప్ర‌భాస్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close