దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ కోవెలమూడి తెలుసు కదా. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తరవాత దర్శకుడిగా మారాడు. అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో తెరకెక్కించాడు. ఇవి రెండూ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నం చేస్తున్నాడు. అదీ బాలీవుడ్లో. కంగనా రనౌత్‌తో ‘మెంటల్ హై క్యా’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. కంగనా, రాజ్‌కుమార్ పేరు చెప్పగానే `క్వీన్` గుర్తొస్తుంది. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లతో పాటు, అవార్డులు కూడా సాధించుకుంది. ఆ జంట మరోసారి కనిపించనుందన్నమాట. మొత్తానికి టాలీవుడ్లో సినిమాలు తీసి ఫెయిల్ అయిన ప్రకాశ్.. ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టాడు. మరి అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.