ఆత్మ‌, ప్రేతాత్మ‌లు ఏం లేవు: ప్ర‌కాష్ రాజ్ స్ప‌ష్టీక‌ర‌ణ‌

‘మా’కి పోటీగా మ‌రో సంస్థ ఏర్పాటు చేయ‌బోతున్నారని `ఆత్మ‌` (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) పేరుతో ఓ సంస్థ‌ని స్థాపిస్తున్నార‌ని ఈరోజుంతా వార్త‌లొచ్చాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే `సినిమా బిడ్డ‌లం` ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది మూకుమ్మ‌డిగా రాజీనామా చేశారు. అయితే కొత్త అసోసియేష‌న్ విష‌యంలో ప్ర‌కాష్ రాజ్ స‌ముఖంగా లేరు. `ఆత్మ‌, ప్రేతాత్మ‌ల్లాంటివేవో వ‌స్తున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అదేం లేదు` అని క్లారిటీగా చెప్పేశారు. రాజీనామా చేసేది.. విష్ఱుకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌డం కోస‌మే అని, `మా` స‌భ్యుల కోసం, వాళ్ల అభివృద్ధి, శ్రేయ‌స్సు కోస‌మే అని, బ‌య‌ట ఉండి కూడా ప‌ని చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.

‘మా’ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన విష‌యం కూడా ఈ ప్రెస్ మీట్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. “మా ప్రాధ‌మిక స‌భ్య‌త్వానికి నేను రాజీనామా చేశా. కానీ విష్ణు ఒప్పుకోలేదు. నేను నా రాజీనామాని వెన‌క్కి తీసుకోవ‌డానికి సిద్ధంగానే ఉన్నా. కానీ ఒకే ఒక్క ష‌ర‌తు. తెలుగువాడు కాక‌పోయినా, మా స‌భ్యుడైతే చాలు.. పోటీ చేయ‌డానికి అర్హుడే. ఈ నిబంధ‌న‌ని బై లాస్ లో మార్చ‌కుండా ఉంటానంటే నేను `మా` స‌భ్యుడిగా ఉండ‌డానికి సిద్ధం“ అంటూ ప్ర‌క‌టించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close