ప్ర‌కాష్‌రాజ్‌తో కృష్ణ‌వంశీ సినిమా

కృష్ణ‌వంశీ సినిమాల్లో ప్ర‌కాష్‌రాజ్‌కి మంచి పాత్ర‌లు ప‌డ్డాయి. అంతఃపురం అయితే.. ప్ర‌కాష్‌రాజ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఖ‌డ్గంలోనూ హీరోల‌కు స‌మాన స్థాయి పాత్ర క‌ల్పించాడు. కొన్నాళ్లు వీళ్ల ప్ర‌యాణం సాఫీగానే సాగింది. అయితే మ‌ధ్య‌లో కొన్ని విబేధాలు వ‌చ్చాయి. `గోవిందుడు అంద‌రివాడేలే`తో మ‌ళ్లీ క‌లిసిపోయారు. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న‌ట్టు స‌మాచారం. ఈసారి ప్ర‌కాష్ రాజే.. కృష్ణ‌వంశీ హీరో. మ‌రాఠీలో నానా ప‌టేక‌ర్ న‌టించిన ‘న‌ట సామ్రాట్‌’ అనే చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని కృష్ణ‌వంశీ భావిస్తున్నాడ‌ని స‌మాచారం. నానా ప‌టేక‌ర్ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రానికి ప్ర‌కాష్‌రాజే నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని తెలుస్తోంది. `రుద్రాక్ష‌` అనే ప్రాజెక్టు కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. కాక‌పోతే.. దానికి బ‌డ్జెట్ ఎక్కువ అవుతుంది. `న‌ట సామ్రాట్‌` అయితే.. తక్కువ బ‌డ్జెట్లో పూర్తి చేయొచ్చు. అందుకే కృష్ణ‌వంశీ ప్ర‌కాష్‌రాజ్ సినిమాకే తొలి ప్రాధాన్యం ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close