సినిమాల‌కు స‌మంత ‘బ్రేక్‌’… కార‌ణ‌మేంటి?

ఓ బేబీతో ఓ మంచి హిట్టు కొట్టింది స‌మంత‌. లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే ఇప్పుడు స‌మంత పేరు కూడా ప‌రిశీంచొచ్చు అనే ధైర్యాన్ని, న‌మ్మ‌కాన్ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు క‌లిపించింది స‌మంత‌. ప్ర‌స్తుతం త‌న చేతిలో `96` రీమేక్ ఉంది. ఇది వ‌ర‌కే ఒప్పుకున్న ఒక‌ట్రెండు సినిమాలు ప‌ట్టాలెక్కాల్సివుంది. అయితే.. ఇవి మిన‌హా స‌మంత మ‌రో సినిమా ఒప్పుకోవ‌డం లేదు. ఇటీవ‌ల ఒక‌రిద్ద‌రు కొత్త ద‌ర్శ‌కులు స‌మంత‌ని సంప్ర‌దించారు. క‌నీసం క‌థ విన‌డానికి కూడా స‌మంత ఆస‌క్తి చూపించ‌లేద‌ని తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు కొత్త క‌థ‌లు ఏవీ విన‌కూడ‌ద‌ని, కొత్త సినిమాలు ఒప్పుకోకూడ‌ద‌ని స‌మంత భావిస్తుంద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఇటీవ‌ల వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న స‌మంత – ఇప్పుడు త‌న‌కంటూ కొంత స‌మ‌యం కేటాయించుకోవాల‌ని చూస్తోంద‌ని, అందుకే కొత్త సినిమాల‌పై ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని, చేతిలో ఉన్న ప్రాజెక్టుల్ని వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌ని భావిస్తోంద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close