టీఎస్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏజీ వాదనలు..! పరిపూర్ణానంద తెచ్చిపెట్టిన కొత్త చిక్కు ..!

పరిపూర్ణానంద తనకు నగర బహిష్కరణ శిక్ష విధించడంపై.. హైకోర్టును ఆశ్రయించారు. అది సహజమే కానీ.. పరిపూర్ణానంద తరపున వాదించడానికి తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా పనిచేసి,రాజీనామా చేసిన దేశాయి ప్రకాశ్ రెడ్డి ముందుకు వచ్చారు. ఇది ప్రభుత్వానికి షాక్‌కు గురి చేస్తోంది. ఈ కేసులో ప్రభుత్వం తరపును అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు వాదిస్తున్నారు. పరిపూర్ణానంద తరపున దేశాయి ప్రకాశ్ రెడ్డి రంగలోకి దిగారు. ప్రకాశ్ రెడ్డి మొన్నటి వరకు తెలంగాణ అడ్వకేట్ జనరల్‌గా పని చేశారు. కానీ వివాదాస్పద తీరిలో రాజీనామా సమర్పించాల్సి వచ్చింది.

అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో గొడవ చేశారంటూ.. ఎమ్మెల్యేలు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,సంపత్‌లపై స్పీకర్ అనర్హతా వేటు వేశారు. వారు కోర్టుకు వెళ్లడంతో.. విచారణలో.. కోర్టుకు వీడియోలు సమర్పిస్తామని.. అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చారు. తమకు అడగకుండా.. కోర్టుకు ఎలా చెబుతారని.. ప్రభుత్వ వర్గాలు.. ప్రకాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి కూడా.. ప్రకాష్ రెడ్డి తీరును సీరియస్‌గా పరిగణించి రాజీనామా లేఖ తీసుకున్నారు. కానీ ఆమోదించలేదు. రాజీనామా ఆమోదం పొందలేదన్న కారణంగా.. కొద్ది రోజులుగా ప్రాక్టీస్ చేయడం లేదు. నాలుగు నెలలుగా ఈ రాజీనామా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.

అయితే ప్రభుత్వమే కావాలని చేస్తోందన్న అనుమానంతో ఉందని భావిస్తున్న ప్రకాష్ రెడ్డి…ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిపూర్ణానంద కేసులో వాదించేందుకు రంగంలోకి దిగారు. వృత్తిలో భాగంగా ఒక న్యాయవాదికి ఎవరి కేసునైనా వాదించే హక్కు ఉంటుంది. కానీ ఆయన రాజీనామాను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఆమోదించలేదు. అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా ఆమోదించకుండా నాలుగు నెలలుగా పెండిగ్ లో ఉంచి వృత్తికి అడ్డుపడుతున్నారన్న అసంతృప్తితోనే ఈ కేసు వాదించేందుకు రెడీ అయ్యారు. పరిపూర్ణానంద కేసులో ప్రకాశ్ రెడ్డి వ్యవహారం న్యాయవాదుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కేసు పరిపూర్ణానంద వ్యవహారం కాకుండా అడ్వకేట్ జనరల్ వర్సెస్ ప్రభుత్వంగా మారింది. రాజీనామాను ఆమోదించలేదు కాబట్టి.. ప్రకాష్ రెడ్డి ఇంకా ఏజీనే అనేవాళ్లు కూడా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close